కందుకూరులో రియాల్టర్ ఆత్మహత్య..!

Publish Date:Sep 10, 2026

Advertisement

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన రియాల్టర్ బాణాల రామ్‌రెడ్డి వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు, వెంచర్‌కు సంబంధించిన భూ వివాదాలు, పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నేదునూరు గ్రామానికి చెందిన బాణాల రామ్‌రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని బల్దేవ్, నరసింహారావు, మూర్తి తదితరుల వద్ద డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించి రెవెన్యూ సమస్యలు, లిటిగేషన్‌లు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు భారీగా అప్పులు చేశారు.


2018 నుంచి ఇప్పటివరకు భూమి డెవలప్‌మెంట్ ఆలస్యం కావడంతో పాటు, మరోవైపు భూ యజమానులు భూమిని ఇవ్వబోమంటూ ఒత్తిడి చేయడం, అప్పులు పెరిగిపోవడం, పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి రావడంతో రామ్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న నేదునూరులోని తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామ్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


రామ్‌రెడ్డి గచ్చిబౌలిలో సుమారు రూ.16 కోట్ల విలువైన విల్లాలో నివాసం ఉంటుండగా, స్వగ్రామమైన నేదునూరులో సుమారు రూ.3.5 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారు. ఆయనకు నేదునూరులో 16 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. పటాన్‌చెరువులో 250 ఎకరాల భూమిని కొనుగోలు చేసి డెవలప్‌మెంట్ చేపట్టిన రామ్‌రెడ్డి.. ఆ భూమికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు, పెట్టుబడిదారుల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కందుకూరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

 

 

 

(Realtor commits suicide in Kandukur, Ranga Reddy District,  Banala Ram Reddy, Real estate business, Nedunur, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News) 

By
en-us Political News

  
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన వ్యవహారం హైదరాబాద్ సచివాలయంలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.