రాయదుర్గం భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతంటే?

Publish Date:Aug 21, 2026

Advertisement

 

రాయదుర్గంలోని భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్‌ పీ1 ఎకరా రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. రాయదుర్గంలోని పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించారు. అయితే, పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51 శాతం అధికమని అధికారులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఈ వేలం ఫలితం స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్నదానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో టీజీఐఐసీ గత మేలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు పలికింది. కేవలం మూడు నెలల్లోనే ఆ రికార్డును అధిగమిస్తూ ఇప్పుడు పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.264 కోట్ల ధర రావడం విశేషం. హైదరాబాద్‌లోని కీలక వ్యాపార ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతున్నదానికి ఇది నిదర్శనమని భావిస్తున్నారు.

ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహించారు. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ప్రత్యేక ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. జాతీయ స్థాయి ప్రముఖ డెవలపర్లు పోటీలో పాల్గొనడంతో వేలం అత్యంత పోటీతత్వంతో సాగింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. పీ1 ప్లాట్ వేలం విజయవంతం కావడం తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్‌లకున్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇది కేవలం భూమికి మంచి ధర రావడం మాత్రమే కాదని, పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడుల కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నారు. ఈ విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అందిస్తున్న దూరదృష్టితో కూడిన నాయకత్వమే కారణమని టీజీఐఐసీ కృతజ్ఞతలు తెలిపింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొంది. ఈ ఫలితాలతో హైదరాబాద్ దేశంలోని అగ్రశ్రేణి పెట్టుబడి కేంద్రాల సరసన మరింత బలంగా నిలిచిందని తెలిపింది.

Rayadurgam, TGIIC, CM Revanth reddy, Minister D. Sridhar Babu, Director K. Shashanka 
 

By
en-us Political News

  
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.