సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర : వీ.హెచ్

Publish Date:Aug 21, 2026

Advertisement

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న ‘వికసిత్ భారత్’లో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం కాకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని వి.హెచ్. ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. 

రాష్ట్రంలోని మెజారిటీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యానికి అనుగుణంగా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని వి.హనుమంతరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో ఓబీసీ జనాభా వివరాలను నమోదు చేయకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం జనాభా లెక్కలు కీలకమని, ఓబీసీలకు వారి జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు వి.హనుమంతరావు వెల్లడించారు. ఈ మహాసభ ద్వారా బీసీల హక్కులు, జనాభా దామాషా ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.

BJP conspiracy behind CM cancellation of US visit, V. Hanumantha Rao, CWC, Mahabubnagar District, PM MODI, CM Revanth reddy

By
en-us Political News

  
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.