జాతీయ స్థాయిలో జగన్ వ్యతిరేక ప్రచారం
Publish Date:Apr 6, 2012
Advertisement
జాతీయ స్థాయిలో జగన్ వ్యతిరేక ప్రచారం యువరాజా ఆఫ్ కరప్షన్ బుక్ లెట్స్ ముద్రిస్తున్న తెలుగుదేశం గతంలో రాజా ఆఫ్ కరప్షన్ పేరుతొ వేలాది పుస్తకాలు ముద్రించి జాతీయ స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరువును మంటగలిపిన తెలుగుదేశంపార్టీ ఇప్పుడు జగన్ భరతం పట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు జగన్ పై సిబీఐ విచారణ జరుగుతున్నప్పటికీ ఆయన సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. జాతీయ మీడియా కూడా జగన్ కు ప్రజాదరణ ఉందని నమ్ముతోంది. ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశంపార్టీ అధిష్టానం జగన్ అవినీతి వ్యవహారాలను కళ్ళకు కట్టినట్లు చూపించడానికి వేలాది సంఖ్యలో పుస్తకాలు ముద్రిస్తోంది. ఈ పుస్తకాలకు యువరాజా ఆఫ్ కరప్షన్ అనే టైటిల్ కూడా పెట్టింది. ఈ పుస్తకంలో జగన్ పై ఉన్న అన్ని అవినీతి ఆరోపణలు కళ్ళకు కట్టినట్లు వివరించడమే కాకుండా ఇటీవలి కాగ్ రిపోర్టులోని అంశాలను కూడా పొందుపర్చబోతున్నారు. ఈ పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్ లో కూడా ప్రచురించ బోతున్నారు. ఇంగ్లీష్ పుస్తకాలను దేశ రాజధానిలోని అన్ని పార్టీల నాయకులతో పాటు మీడియాకు కూడా అందజేయ బోతున్నారు. గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పుస్తకం ఆధారంగా జాతీయ మీడియా వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై అనేక వ్యతిరేక కథనాలు ప్రసారం చేశాయి. తెహల్కా వారపత్రిక ఆయనపై ప్రచురించిన ప్రత్యేక కథనం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. త్వరలో ఆవిష్కరించబోయే యువరాజా ఆఫ్ కరప్షన్ పుస్తకానికి కూడా ఇటువంటి స్పందనే వస్తుందని తెలుగుదేశంపార్టీ నాయకులు ఆశిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ ఇప్పటికే జగన్ కు వ్యతిరేకంగా ప్రిన్స్ ఆఫ్ కరప్షన్ పేరుతొ ఆన్ లైన్ పేజ్ ను ప్రారంభించింది. దీనిలో జగన్ కు సంబంధించిన అనేక అవినీతి కార్యక్రమాలను పొందుపరచారు.
http://www.teluguone.com/news/content/raja-of-corruption-book-on-ysr-published-by-tdp-24-13214.html





