కాంగ్రెస్ మెడకు… నిజమో కాదో తెలియని రాహుల్ చైనీస్ మీటింగ్

Publish Date:Jul 10, 2017

Advertisement

రాహుల్ మరో వివాదంలో ఇరుక్కున్నారు! ఈసారి వయా చైనా మీదుగా రచ్చలో కాలేశారు! ఇంకేముంది, సోషల్ మీడియాలోని మోదీ భక్తులు చాకిరేవు పెడుతున్నారు. వారి ఏకపక్ష ఆరోపణల్ని సీరియస్ గా తీసుకోకున్నా… ఓ జాతీయ మీడియా ఛానల్ కూడా రాహుల్ ను తప్పుపడుతూ కథనం ప్రసారం చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది!

 

సిక్కిం ప్రాంతంలో ఇండియా, చైనా సైనికులు ఫేస్ టూ ఫేస్ పోరాటానికి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే! ఆ కారణం చేతనే మోదీ, చైనీస్ ప్రెసిడెంట్ జిన్ పింగ్ జీ20 సమావేశాల సందర్భంగా కలిసే అవకాశమున్న కలవలేదు. ఊరికే కరచాలనంతోనే సరిపెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇండియన్ సోల్జర్స్ చైనాను అడ్డుకవటంతో జిన్ పింగ్ కూడా అంతర్జాతీయ వేదికపై టోను మార్చాడు. చుట్టు పక్కల దేశాలతో చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని నీతులు వల్లించాడు. కాని, నిజంగా మాత్రం చైనా నీతి అలా వుండటం లేదు…

 

సిక్కింలో భూటాన్, భారత భూభాగాల్లోకి చైనా చొచ్చుకొచ్చింది. కాని, తప్పంతా ఇండియాదే అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ విదేశాల నుంచి తన పర్సనల్ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చి రాగానే మోదీపై ఫైరైపోయారు. చైనా విషయంలో ఆయనేం చేయటం లేదంటూ విమర్శలు గుప్పించారు. కాని, అంతలోనే చైనా ఓ బాంబులాంటి ప్రెస్ నోట్ తన వెబ్ సైట్లో పోస్టు చేసింది. తరువాత ఠపీమని తొలగించేసింది! దాని సారాంశం ప్రకారం… రాహుల్ గాంధీ చైనా దూతను దిల్లీలో కలుసుకున్నారు. వారిద్దరి మధ్యా చర్చలు జరిగాయి!

 

సాక్షాత్తూ చైనీస్ ఎంబసీ తమ వెబ్ సైట్లో పోస్టు చేసిన రాహుల్ గాంధీ మీటింగ్ నిజం కాదని చెబుతున్నారు కాంగ్రెస్ వారు! అంతా మోదీ భక్తులు, బీజేపి అనుకూల మీడియా దుష్ప్రచారం అనేస్తున్నారు. కాని, చైనీస్ ఎంబసీ వెబ్ సైట్లో పెట్టి మళ్లీ తొలగించిన ప్రెస్ నోట్ గురించి మాత్రం మాట్లాడటం లేదు! అయితే, సోషల్ మీడియాలో ఇప్పటికే చైనా పెట్టి, తీసేసిన ప్రెస్ నోట్ ఇమేజ్ రూపంలో సర్క్యులేట్ అవుతోంది!

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చైనా దూతతో మాట్లాడారా? లేదా? మాట్లాడితే ఏం మాట్లాడి వుంటారు? అసలు రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయన ఏ హోదాలో మీటింగ్ లో పాల్గొన్నారు? ఇలా బోలెడు ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అన్నిట్ని ఖండించి తమ నాయకుడి తప్పేం లేదంటున్నారు కాంగ్రెస్ వారు. మరో వైపు బీజేపి వారు, బీజేపి అభిమానులు … అమెరికా ప్రతినిధితో కూడా గతంలో నోరు జారి మాట్లాడిన రాహుల్ ఈసారీ అలాగే చేసుంటాడంటున్నారు! వికిలీక్స్ ప్రకారం… రాహుల్ ఇంతకు ముందు ఆరెస్సెస్ గురించి , హిందూ ఉగ్రవాదం గురించి అమెరికా అధికారితో ఇష్టానుసారం మాట్లాడాడు!

 

చైనా విషయంలో మోదీని టార్గెట్ చేద్దామనుకున్న కాంగ్రెస్ కు తమ రాహుల్ మీటింగ్ ఆత్మరక్షణలో పడేలా చేసింది! బీజేపి వారికి చాలా కాలంపాటూ విమర్శించటానికి చక్కటి కారణం దొరికింది!

By
en-us Political News

  
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.