కొరడా ఝులిపిస్తున్న ఎన్నికల కమీషన్

Publish Date:May 14, 2012

Advertisement

ఎన్నికల నిబంధనావళిని రోజు రోజుకూ పదునుపెడుతున్నారు. ఎన్నికల కమీషన్ పలురకాల కసరత్తులు చేస్తోంది. టి.ఎన్.శేషన్ హయాం నుంచి ఇప్పటి వరకూ ఎన్నికల నిబంధనావళిని తప్పించేందుకు నేతలు ప్రయత్నించటం కమీషన్ మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోవటం ఆనవాయితీ అవుతోంది. ప్రస్తుత ఎన్నికల కమీషనర్ హెచ్,ఎస్, బ్రహ్మ కూడా ఈ నిబంధనావళిపై తనదైన ముద్ర వేయించుకోవాలని తస్మాత్ జాగ్రత్త అని ఓటరునే నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇదేమిటి ఆని ఆశ్చర్యపోవద్దు ....

 

 

డబ్బు తీసుకున్నావా నీపై కూడా కేసు పెత్తదానీ మేము వెనుకాడబోమని బ్రహ్మ ఓటరును నేరుగా హెచ్చరించారు. దీనివల్ల ఏదైనా కొంత మార్పు సాధించగలమేమోనని ఆయన ప్రయత్నం కాబోలు, అయితే మధ్యలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎండకు వదిలేశారని పలువురు ఆయన్ను ప్రశ్నిస్తున్నారనుకోండి. రాష్టంలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈసారి ప్రలోభపెట్టే అంశాలు చాలా ఉంటాయన్న నివేదిక ఆధారంగానే కమీషనరు పైవిధంగా హెచ్చరించారని సిబ్బంది సమాధానమిస్తున్నారు. అయితే ఎన్నికల నిబంధనావళిలో డబ్బు రవాణాను అదుపు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టుల్లో తనిఖీలతో ఎన్నికల కమీషన్ ఒక కొత్త నిఘా చర్యలకు శ్రీకారం చుట్టింది.

 

అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయ పరిపాలనా ఉద్యోగులను తనకు ఓటేయమని కోరిన మాజీ మంత్రి చింతా మోహన్, చర్చిలో ఎన్నికల ప్రచారం చేసిన టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి వ్యవహారాలపై నివేదిక ఇమ్మని జిల్లా కలెక్టరును ఆదేశించింది. ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకుని తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ప్రసంగించిన టిడిపి నేత చంద్రబాబు నాయుడిపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే సోనియా గాంధీ ఓ పెద్ద క్రిష్టియన్ అని ప్రచారం చేసిన మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం కలెక్టర్ ను కోరింది. అంటే కాకుండా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో జరిగే రైతుచైతన్య యాతాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను ఎంత వరకూ అభ్యర్థులు పాటిస్తారో తెలియదు కానీ నిబంధనావళి విషయంలో తాము మాత్రం సీరియస్ గా స్పందిస్తామని ఎన్నికల కమీషన్ స్పష్టం చేస్తోంది. ఎన్నికల కమీషన్ తీరు ఆయా పార్టీల నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.