కాంగ్రెస్ భవిష్యత్తుకు సవాల్ గా మారిన కడప ఉన ఎన్నికలు?

Publish Date:May 16, 2012

Advertisement

మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కడప ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ జిల్లాలోని రాజంపేట, రాయచోటి అసెంబ్లీస్థానాలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవకపోతే ఆ పార్టీ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటిదాకా పెత్తనం చేసిన ప్రధాన నేతలు పదవులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఇక్కడి కేడర్ ను ఉత్తేజపరిచే విషయంలో శ్రద్ధచూపుతున్నారు.

 

 

 

వై.ఎస్.ఆర్. సొంత జిల్లా అయినందున ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, జగన్ లపై దాని ప్రభావముంటుంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జగన్ సరైన వ్యూహం రచించారని అభినందనలు అందుకున్నారు. ఈ అభినందనలు కాంగ్రెస్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఇటీవల జరిగిన సర్వేలు కూడా జగన్ కు అనుకూలంగా రావటంతో ఈ జిల్లా పరిస్థితిపై ఎఐసిసి తన గూఢచారులను పెట్టుకుంది.

 

 

 

తమ పార్టీ రాష్ట్రనేతలు చేసే ప్రసంగాలు ఏమైనా ఓట్లగా మలచుకోవటానికి ఉపయోగపడతాయా? లేదా? అన్న కోణం లో ఎఐసిసి పరిశీలిస్తోంది. దీంతో రాష్ట్ర నేతలు కూడా కడపజిల్లా ఎన్నికల్లో విజయం కోసం చేయాల్సిన పని ఏమిటని ప్రశ్నించి కార్యకర్తలకు వరాలను ఇస్తున్నారు. ఈ వరాలు కూడా తమకు ఓట్లను తెచ్చిపెడతాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అలానే మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ జూన్ 15 తరువాత అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. సిఎం పర్యటనకు ముందుగానే ఈ జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ బొత్సా సత్యన్నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. జగన్ వక్రీకరించినా రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని సిఎం కిరణ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇలా కడపజిల్లాలో ఓటర్లను ఆకర్షించి తమ హోదాలను కొనసాగించేందుకు వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో భవిష్యత్తులోనే తేలుతుంది.

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.