తెలంగాణా ఉద్యమాన్ని మరిచిపోయిన రాజకీయ నాయకులు
Publish Date:May 16, 2012
Advertisement
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అనేక ఉద్యమాలు చేసి చివరికి సాధించిందేమిటి? ఈ ప్రశ్న తెలంగాణా మేథావులను కలిచివేస్తోంది. ప్రత్యేకరాష్ట్రం కోసం రాజకీయ నాయకులు ఎలా చెబితే అలా ప్రయాణించి చివరికి ఎక్కడికి చేరుకున్నామన్న ప్రశ్న వారి మదిని తొలిచేస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమాన్ని విస్మరించి ఉప ఎన్నికల్లో తలమునకలైందని వారు వాపోతున్నారు. అసలు ఎందుకోసం 800మంది విద్యార్థుల జీవితాలను బలిపెట్టాల్సి వచ్చిందన్న ప్రశ్న మేథావులను కలచివేస్తోంది, ఒకవైపు కరువు, ఆగని కూలీల వలసలు, అవసరం లేకపోయినా ఎన్నికలు మిగిలాయని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఉద్యమాల పేరుతొ కోట్లాది రూపాయలు దండుకుని ప్రజలను మోసగించారని వారు వాపోతున్నారు. 1956 నవంబరు 1వ తేదీన సమైక్యాంధ్ర ఏర్పడ్డప్పుడున్న వాతావరణం కూడా ఇప్పుడు లేదని చెప్పకుండానే తెలుస్తోందంటున్నారు. అప్పట్లో నిజాం పరిపాలన నాటి ఒప్పందాలు ఇప్పుడు గల్లంతయ్యాయని, దీంతో పాలమూరు వంటి పలు జిల్లాలు సాగునీరు, తాగునీరు అందాకా సతమత మవుతున్నాయని వాపోతున్నారు. జూరాల ద్వారా 17.4 టిఎంసిల నీటిని ఆర్.డి.ఎస్. ద్వారా 15.9 టిఎంసిల నీటిని ఉపయోగించుకోలేక పోతున్నామన్నారు. కొత్తగా ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవంటున్నారు. ఉప ఎన్నికల హడావుడి తరువాతైనా సరైన పంథాలో పయనిస్తామని వారు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/political-leaders-forgotten-telangana-agitation-24-14085.html





