తిరుపతి లడ్డూ దక్కేదక్కేదెవరికో?
Publish Date:May 16, 2012
Advertisement
తిరుమల ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాని సందర్శించాలంటే ముందు తిరుపతికి చేరుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల విషయంలో రోమ్ తో పోటీ పడే తిరుపతి అసెంబ్లీకి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ తామే గెలుపొందాలని ప్రధానపార్తీలు పట్టుదలగా ఉన్నాయి. గెలుపు ఆరాటం ఎక్కువయి ఏదైనా చేయండి ఇక్కడ మనం తప్పక విజయం సాధించాలంతే అనే స్థాయికి ఆ పార్టీల నేతలు వచ్చి కార్యకర్తలను ప్రాధేయపడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ వేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. కడపజిల్లాలో తన పర్యటన ముగించుకుని వచ్చిన తరుఅవత సిఎం కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణతోనూ, ముఖ్యకార్యకర్తలతోనూ మాట్లాడారు. అలానే మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకరరెడ్డి గురించి తాను చూసుకుంటానని సిఎం హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 262 పోలింగ్ బూత్ లున్నాయి. తెలుగుదేశం పార్టీ బూత్ ల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి ఎన్నికలకు సిద్ధమవుతోంది. అలానే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహాదేవ నాయుడు నియోజకవర్గంలో ప్రచారపరిస్థితి, పార్టీ విజయావకాశాలు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తిరుపతి చేరుకున్నారు. తాను ఎన్నికల తరువాతే తిరిగి వేదతానని ఆయన అంటున్నారు. ఈ పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి ఉదయమే లేచి వాకింగ్ కు వెళుతూ తోటి వాకర్లను ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అలానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కూడా సంఘాలు, అసోషియేషన్లను టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి కందాటి మురళి కూడా ప్రచారంలో ఉన్నారు. తనను గెలిపిస్తే కార్మిక, ఉద్యోగం మహిళా సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఈయన తన ప్రచారంలో భాగంగా హామీ ఇస్తున్నారు. ఇలా ప్రతీ పార్టీ తమ గెలుపుకోసం ఒకవైపు కార్యకర్తలను సమీకరించుకోవటం, మండుటెండలోనూ ఆపకుండా ఇంటింటికి తిరగటం, ప్రత్యేకించి సమస్యల పరిష్కారాల హామీలు వుప్పించటం చూస్తుంటే తిరుపతి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు పార్టీలకు ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పకుండానే అర్థం అవుతోంది.
http://www.teluguone.com/news/content/famous-piligrim-tirupathi-24-14079.html





