Publish Date:Aug 29, 2012
అసోం అల్లర్లలో విద్యేషాల్ని రెచ్చగొట్టడానికి ఫేస్ బుక్ ని కొందరు అడ్డంగా వాడుకున్నారన్న విషయం బైటపడిపోయింది. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిత్రాల్ని ఈ మాధ్యమం ద్వారా చాలామందికి సర్క్యులేట్ చేసి నష్టాన్ని భారీగా పెంచారన్న విషయం ప్రాథమిక విచారణలో తేలింది. దీన్ని సాకుగా చూపిస్తూ మొత్తం ప్రసారమాధ్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రతిపాదనకు ప్రభుత్వం పదునుపెడుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు చెప్పుకుంటున్న స్వీయనియంత్రణ ఒట్టిమాటేనని చెబుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలతోపాటు ఇంటర్ నెట్ మాధ్యమాల్నికూడా చెప్పుచేతల్లో పెట్టుకునే ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించింది. 1978 ప్రెస్ కౌన్సిల్ చట్టానికి సవరణలు చేసి వెంటనే మీడియాపై అదుపును సాధించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సూచించింది.
పాత్రికేయుల నియామకాల విషయంలో ప్రింట్ మీడియాలో ఉన్న భద్రత ఎలక్ట్రానిక్ మీడియాలో లేకపోవడం విచారకరమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాలోకూడా ప్రింట్ మీడియా అనుసరిస్తున్న విధానాల్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిసిఐ గట్టిగా వాదిస్తోంది. పిసీసీ పేరును మీడియా కౌన్సిల్ మార్చాలనికూడా తీర్మానం జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/press-council-of-india-24-16960.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.