రాష్ట్ర విభజనపై గవర్నర్‌తో కిరణ్ చర్చలు?

Publish Date:Aug 29, 2012

Advertisement

సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. వీరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. విద్యుత్‌ సంక్షోభం, ధర్మాన రాజీనామా, యస్‌సి, యస్టీ సబ్‌ ప్లాన్‌, రాష్ట్ర విభజన లేదా సమైఖ్యతా వాదం ముందుకొస్తే జరిగే పరిణామాలపై ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవుతాయో అన్న విషయాలపై చర్చించినట్లు తెలిసింది. విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి వివరిస్తూ ఎన్‌.టి.పి.సి. ఛైర్మన్‌ అనూప్‌ అగర్యాల్‌ తో మాట్లాడి 335 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని రాష్ట్రానికి అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధర్మాన రాజీనామా విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుందని, ప్రతిపక్షాలకు, ప్రజలకు ఎటువంటి అపోహలకు తావివ్వకుండేందుకు సరైన నిర్ణయం తీసుకుంటామని తెలియచేశారు. ఎస్‌సి, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ విషయాలను వివరించి దానిని చట్టబద్దత కల్పించే దిశగా చేపడుతున్న మార్గాల గురించి వీరిరువురూ చర్చించినట్లు తెలిసింది.

 

అలాగే ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఫీజుల నిర్ణయం, 78 కాలేజీల ఫీజు పెంపు కూడా వారి మద్య చర్చకు వచ్చింది. ఫీజును అధికంగా పెంచిన కాలేజీలలో టాస్క్‌ఫోర్సు తనిఖీలు జరిపితే చాలావరకు కాలేజీలలో అన్ని వసతులు లేవన్న విషయం బయటపడుతుందని తద్వారా కేవలం 24 కాలేజీలు మాత్రమే అధికఫీజులు రాబట్టే కాలేజీలుగా ఉంటాయని, యాజమాన్య సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్‌లోనే జరిపే విధంగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే సమైఖ్యరాష్ట్రంగా ప్రకటించినా లేదా రెండుగా విభజించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే తలెత్తే సమస్యలు దానికి తీసుకునే చర్యలు కూడా వారిరువురూ మాట్లాడినట్లు తెలిసింది.

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.