Publish Date:Apr 16, 2026
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు విచారణపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగు తోంది. ఈ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలతో పాటు, తనిఖీ లకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా నమోదు కావడం కేసును మరింత తీవ్రతరం చేసింది.
అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డిని ఈ కేసులో A2 నిందితుడిగా చేర్చారు.
ఇప్పటికే ఈ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి బెయిల్ కోసం ఉప్పర్ పల్లి కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఉప్పర్‌పల్లి కోర్టు ఆయనకు బెయిల్‌ను తిరస్కరించింది. అనంతరం పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రారంభ విచారణ జరిపిన హైకోర్టు, కేసు వివరాలు మరియు దర్యాప్తు పురో గతిపై మరిన్ని సమాచారం అవసరమని భావించి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ప్రస్తుతం పైలెట్ రోహిత్ రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయని, తదుపరి విచారణలో కేసు కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయని న్యాయ వర్గాలు భావిస్తున్నారు.ఈ కేసు రాజకీయ వర్గాల్లో కూడా ప్రాధాన్యత సంతరించు కుంది. హైకోర్టులో జరగ నున్న తదుపరి విచారణపై అందరి దృష్టి నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pilot-rohit-reddys-bail-petition-hearing-postponed-36-217531.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.