Publish Date:Mar 29, 2025
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Publish Date:Mar 29, 2025
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు.
Publish Date:Mar 29, 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్‌తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది.
Publish Date:Mar 29, 2025
తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు
అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.
తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది.
Publish Date:Mar 29, 2025
గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు.
Publish Date:Mar 29, 2025
యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్ అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Publish Date:Mar 29, 2025
మణిపూర్ లో భూమి కంపించింది.శనివారం (మార్చి 29) మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
Publish Date:Mar 29, 2025
Publish Date:Mar 29, 2025
ఎపిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి చివరి వారంలో నాటికే మునుపెన్నడూ లేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎపిలోని 150 మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి
Publish Date:Mar 29, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు.
Publish Date:Mar 29, 2025
తెలంగాణ కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓ యువకుడు పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించాడు. ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు అనుకుంటే పొరబడినట్టే. ఇద్దర్ని ప్రేమించానని ఆ యువకుడు ప్రేమించిన యువతులకు చెప్పినప్పటికీ ఆ యువతులకు కోపం రాలేదు. మేమిద్దరం నిన్ను పెళ్లి చేసుకుంటామన్నారు. లింగాపూర్ మండలం గుమ్మూర్ కుచెందిన సూర్యదేవ్ ఇద్దరు యువతులను ఒకే సారి పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు.
Publish Date:Mar 29, 2025
తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేల్చేసింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది.
Publish Date:Mar 29, 2025
దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ నంబర్ వన్ గా నిలిచారు. ఒక ఆంగ్ల దినపత్రిక 2025 సంవత్సరానికి దేశంలో వంద మంది మోస్ట్ పవర్ పుల్స్ ఇండియన్స జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నది మోడీ మాత్రమే.