మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడో?

Publish Date:Mar 29, 2025

Advertisement

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏప్రిల్ 3 ముహూర్తం  అని కూడా ప్రచారం జరిగింది. అలాగే  కొత్త మంత్రులు వీరే అంటూ నాలుగు పేర్లు, నాలుగు ముఖాలు తెరపైకి వచ్చాయి. 

అయితే  రోజు రోజుకూ సీన్ మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి, ఓ వంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించుకుని మరీ మంత్రివర్గ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది అన్న అనుమానాలు  వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ కాదు  మరేదో  ఉందనే  కథనాలూ వచ్చాయి. అయితే  ఆ అనుమానాలు అంతగా నిలవలేదు.

 అయితే ఈ ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ స్వరూప స్వభావాలు మెల్ల మెల్లగా మారుతూ వస్తున్నాయి. నిజానికి  రేపు  ఎప్పుడైనా  జరిగేది  కేవలం మంత్రి వర్గ విస్తరణ మాత్రమే కాదు. మంత్రి వర్గంలో ఉన్న ఖాళీలను నింపే క్రతువు మాత్రమే కాదు, మంత్రి వర్గంలో  భారీగానే   మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అవును జరిగేది, మంత్రి వర్గ విస్తరణ కాదు,   మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం  ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే నిర్ణయానికి వచ్చిందని కాంగ్రస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రణాళికతో దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని  తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని రాహుల్ సంకల్పించారని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను నెలలు అయినా  కాకముందే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతున్నట్లు వస్తున్న వార్తల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు. అందుకే  మంత్రి వర్గం సర్జరీ కి సిద్దమయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక విధంగా, డిఫరెంట్ సోర్సెస్  నుంచి సేకరించిన   గ్రౌండ్  రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు  చేపట్టేదుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసినట్లు చెపుతున్నారు. 

అంతే కాదు  మార్చి 24న ఢిల్లీలో జరిగిన చర్చల్లోనే, మంత్రి వర్గ పని తీరును సమీక్షించినట్లు చెపుతున్నారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సరైన సమన్వయం లేక పోవడంతో ఈ శాఖల్లో మార్పులు తప్పవని  కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి  అన్నిటికంటే ముఖ్యంగా మంత్రివర్గంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటుగా  అవసరమైతే ఉద్వాసనలు వెనకాడరాదనే నిర్ణయానికి అదిస్థానం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. 

అదొకటి అలా ఉంటే, మూడవ తేదీ ముహూర్తం విషయంలోనూ ఇంకా పూర్తి స్పష్టత రాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీకి దగ్గరైన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు కీలక మార్పుల విషయంలో  తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అధిష్టానం పునారలోచనలో పడిందని అంటున్నారు. ఈ సందర్భంగా సదరు సీనియర్ నాయకుడు గతంలో ఫిర్యాదుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన విషయాన్నీ గుర్తు చేసిన మీదట, మరో సారి రాష్ట్ర నాయకులతో మరింత లోతుగా చర్చించిన తర్వాతనే  ముహూర్తం ఖరారు  చేయాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే, మూడవ తేదీ ముహూర్తం మిస్సయ్యే అవకాశం లేక పోలేదని అంటున్నారు.ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ  రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాతనే, ముహూర్తం ఖరారు అవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
గవర్నర్‌ అధికారాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలకు పంపడాన్ని సవాల్ చేస్తూ స్టాలిన్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వైకాపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు బెన్నిలింగం పూటకో మాట మాట్లాడుతున్నారు
ఎపిలో ఎన్టీఆర్ వైద్య సేవలు యదాతధంగా అమలు కానున్నాయి. వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం( ఆశా)  ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర చర్చలు జరిపి వైద్య సేవలు పునరుద్దరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీ ఆక్వా రైతులపై పడింది. ట్రంప్ వేసిన ట్యాక్సులు మేం కట్టలేం బాబో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు. ఇప్పటికే లక్షలు, కోట్లలో నష్టపోయామని, ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు. అతడు చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు.
సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పై విడుదలైన పోసాని   సోమవారం సిఐడి కార్యాలయానికి  వచ్చి సంతకం చేసే సమయంలో అనుకోని పరిణామం జరిగింది.
తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. ఆఖరికి ప్లాస్టిక్ బాటిళ్లకు కూడా అనుమతి లేదు. అయితే ఈ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని గాజు వాటర్ బాటిళ్ల రూపంలో భక్తులను దోచుకుంటున్నారు వ్యాపారులు. గత వైసీపీ హయాంలో కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు ఆ నిషేధాన్ని కేవలం ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో మాత్రమే కఠినంగా అమలు చేశారు.
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 8) తుది తీర్పు వెలువరించింది. గతంలో ఇదే కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24 వ జాతీయ మహాసభ లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. కొత్తగా పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ లో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం దక్కింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కొండ్రు మురళీ మెహన్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దళిత నాయకుడు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న రాజంతో పాటు, గతంలో పోటీ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం యాక్టివ్ పాలిటిక్స్ నడిపించే ఆ లీడర్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.
గిరిజన గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం(ఏప్రిల్ 7) అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండల పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరి కొరివితో తలగోక్కుంటున్నట్లుంది. ఆయన ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు సోమవారం ప్రపంచంలోని ప్రధాన సూచీల్లో ఒక్కటీ లాభాల్లో లేకుండా పోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.