Publish Date:Apr 14, 2025
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇటు పార్టీ నేతలకు, అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ పార్టీ జాతీయఅధ్యక్షు ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది.
Publish Date:Apr 14, 2025
అదేమిటో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Apr 14, 2025
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.
Publish Date:Apr 14, 2025
ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు.
Publish Date:Apr 14, 2025
స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు.
Publish Date:Apr 14, 2025
తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, వారు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమలేశుని దర్శనం జాప్యం లేకుండా వేగంగా జరిగేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవడానికి రెడీ అయ్యింది.
Publish Date:Apr 14, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (ఏప్రిల్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
Publish Date:Apr 13, 2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
Publish Date:Apr 13, 2025
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
Publish Date:Apr 13, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Publish Date:Apr 13, 2025
తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన ఖాతాలోకి ఓ మునిసిపాలిటీ చేరింది. రాష్ట్రంలో జనసేన ఖాతాలో చేరిన తొలి మునిసిపాలిటీగా నిడదవోలు మునిసిపాలిటీ నిలిచింది. ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది.
Publish Date:Apr 13, 2025
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ( ఎమ్మెల్సీ ఎన్నికల, పోలింగ్ కు ఇంకా వారం రోజులకు పైగానే సమయం వుంది. ఏప్రిల్ 23 న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయినా ఇంకా పోలింగే జరగక పోయినా,ఫలితం అయితే వచ్చేసింది.గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలిసి పోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం(ఎల్ఎసీ)ఎలెక్టోరల్ కాలేజీ లో పార్టీలకు ఉన్న బలా బలాను బట్టి చూస్తే,ఎంఐఎం గెలుపుకు ఢోకా లేదు. అయితే, ఫలితం ముందుగానే తెలిపోయినా, ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది? అంటే, అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు.
Publish Date:Apr 13, 2025
వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశి జనసేన గూటికి చేరారు.