Publish Date:Mar 29, 2025
దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ నంబర్ వన్ గా నిలిచారు. ఒక ఆంగ్ల దినపత్రిక 2025 సంవత్సరానికి దేశంలో వంద మంది మోస్ట్ పవర్ పుల్స్ ఇండియన్స జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నది మోడీ మాత్రమే.
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో విదేశాంగ మంత్రి జైశంకర్ మూడో స్థానంలో నిలవగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్ నాలుగో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు 14వ స్థానంలోనూ, రేవంత్ రెడ్డి28వ స్థానంలోనూ నిలిచారు,
అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కూడా స్థానం దక్కింది. ఇంకా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కూడా మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో చోటు దక్కింది. ఇంకా వ్యాపార దిగ్గజాలు రిలయన్స ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఇంకా ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి స్థానం సినీ హీరో అల్లు అర్జున్ కు కూడా స్థానం దక్కింది. ఈ జాబితాలో 98వ స్థానం దక్కింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prime-minister-modi-top-in-most-powerful-ndians-list-39-195214.html
అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది క్లాసికల్ నృత్య రీతులలో కూచిపూడి నృత్యం అత్యంత క్లిష్టమైనది. దీనిలో కాలి వేళ్లనుండి ఆపాదమస్తకం డాన్స్ లో భాగం గా స్పందించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటి గొప్ప కళ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడుకు చెందిన వివాదాస్పద స్వామి నిత్యానందస్వామి మరణించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన మేనల్లుడు సుందరేశ్ నుంచే ఈ ప్రకటన వెలువడింది. సినీ నటి రంజితతో రాసలీలతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం పోటీసులు జారీ చేసింది. ఏపీలో అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. మైనింగ్ కేసులో ఆయన మంగళవారం (ఏప్రిల్ 1) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన డుమ్మా కొట్టారు. వాస్తవానికి పోలీసులు ఆయనకు సోమవారం (మార్చి 31) విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు.
పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూటమిప్రభుత్వం ఎపి హైకోర్టులో పిటిషన్ వేసింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో ప్రధాన నిందితురాలు.
తమిళ నాడులో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చిందంటే, అందుకు కారణం ఒకేఒక్కడు. ఆ ఒక్కడు మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అలాగే కమల దళానికి రాష్ట్రంలో అంతో ఇంతో రాజకీయ విజయం దక్కిందంటే ఆ క్రెడిట్ కూడా అన్నామలై అకౌంటులోనే చేరుతుంది. అంతే కాదు సూది మొలంత చోటు లేని రాష్ట్రంలో ఉరూరా కాషాయ జెండా ఎగురుతోందంటే అది కూడా ఆయన ఖాతాలోనే చేరుతుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. తొలివిడతలో మాత్రం పాత కొత్త వారికి ఓ మూడు పదవులు ఇచ్చారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లు తున్న భద్రాద్రి రాములోకి కల్యాణం కోసం ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరి స్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తి ప్రచారమేనా అంటే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది.
వైకాపా నేత లక్ష్మి పార్వతికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని 2009లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరి విల్లు చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటి సివిల్ కోర్టు చట్టబద్దంగా వ్యవహరించలేదని పేర్కొంది. విల్లుపై సాక్షి సంతకం చేసిన జె. వెంకట సుబ్బయ్య వారసుడు జెవి ప్రసాదరావు సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది.