Publish Date:Mar 29, 2025
మొదటినుంచి వివాదాలకు కేంద్రబిందువైన కృష్ణా జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికి పూడి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. శనివారం (మార్చి29) మంగళగిరిటిడిపి కార్యాలయానికి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు తరలివచ్చాయి. అనేక పర్యాయాలు అధిష్టానం హెచ్చరిస్తున్నప్పటికీ కొలికి పూడి తన వైఖరి మార్చుకోలేదు. స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. తిరువూరు నియోజకవర్గ టిడిపి నేత అలవాల రమేష్ రెడ్డిపై చర్య తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇవ్వడం తాజాగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మంగళగిరి టిడిపి కార్యాలయానికి టిడిపి కార్యకర్తలు చేరుకున్నారు. కొలికిపూడి మా కొద్దంటూ నినాదాలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/protest-in-mangalagiri-demanding-kolikipudi-out-39-195229.html
దేశంలోకి అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2005 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై శుక్రవారం (ఏప్రిల్ 4) సంతకం చేశారు. దీంతో ఇక ఇది చట్ట రూపం దాల్చినట్లే.
ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు విషయంలో చాల పట్టుదలగా ఉంది. భాగస్వామ్య పార్టీలపై తనదైన ముద్ర వేస్తూ మోడీ సర్కార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు దిశగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నది. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందింది.
జగన్ హయాంలో కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా పాలన సాగింది. జగన్ ఐదేళ్ల పాలన అంతా దోచుకో.. దాచుకో అన్న తరహాలోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన తరువాత.. జగన్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతోంది. తాజాగా జగనన్న కాలనీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రాచలం ప్రకటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ శనివారం (ఏప్రిల్ 5)మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో సాయంత్రానికి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది.
భద్రాచలం సీతారామ స్వామి కల్యాణానికి సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను నేసి బహూకరించనున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లాలో రాజకీయాలను శాసించిన కామ్రేడ్లు నేడు దాదాపుగా జీరోకు చేరుకున్నారు. 1980 లో జరిగిన సమితి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు (సీపీఎం,సీపీఐ) జిల్లా లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ సముచిత స్థానాలు దక్కించుకున్నారు.
ఏప్రిల్ 3 తేదీ వచ్చింది. వెళ్ళింది. కానీ ఆ రోజున జరుగుతుందని అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు మూడున ముహుర్తమని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు.
ఖాతాదారులు ఏకంగా బ్యాంకుకే తాళాలు వేసిన సంఘటన ఇది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగింది. కొందరు ఖాతాదారులు రాయపర్తిలోని ఎస్బీఐకు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు.
తండ్రితోనే తన పోటీ అంటున్నారు మంత్రి నారా లోకేష్. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేవారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 4) శ్రీవారిని మొత్తం 66 వేల 327 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల354 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
వివాదాస్పద లేడీ అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల కు ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని లోబరుచు కుంది.
ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు.
తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.