Publish Date:Mar 29, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు. జైలు నుంచి ఆయనను కంకిపాడు పోలీసు స్టుషన్ కు తరలించారు. అంతకు ముందు జైలు నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.
వైద్యులిచ్చిన నివేదిక ఆధారంగా వంశీ ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడ నుంచి కంకిపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ వంశీని విచారిస్తున్నారు. ఇంతకీ గన్నవరం పోలీసులు వంశీ కస్టడీని ఎందుకు కోరారంటే.. ఉమ్మడి జిల్లా అత్కూరు మండలంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి అతని పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని కొందరు ఆక్రమించుకుని, అప్పటికి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ సహకారంతో వారి పేర కుట్రపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై బాధితుడు శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఈ కుట్రకు సూత్రధారి వంశీయేనని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వంశీని కోర్టు అనుమతి మేరకు ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gannavaram-police-take-vamshi-into-custody-39-195222.html
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా స్పందించారు. .
నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, హై-టెక్నాలజీ సేవలను అభివృద్ధిలో దిగ్గజ సంస్థ అయిన సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల రవిచంద్రారెడ్డిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేయడం కాదు.. పక్కన పడేసింది అనడం సబబు.
పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది. మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. వంశీ అక్రమాల, అరాచకాల గుట్టుముట్లన్నీ తెలిసిన రంగాను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వంశీ ఆటకట్టేసినట్లునని విశ్లేషిస్తున్నారు.
స్వల్ప విషయానికి ఘర్షణ పడి ఒక యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేసిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. ఓ యువకుడు సిగరెట్ కాలుస్తున్నాడు. అతడు పీల్చి వదిలిన పొగ తనపైకి వచ్చిందంటూ మరో యువకుడు అతడితో వాదనకు దిగాడు. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారి తీసింది.
వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. పదవుల కంటే పాదయాత్రలతో పాపులర్ అయిన వైఎస్ కుమార్తెకు రాజకీయంగా ఇప్పటి వరకూ ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో చెల్లి సేవలను వాడుకున్న జగన్ అధికారంలోకి రాగానే ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు.
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ పెడుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటరీ,మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభలో ప్రవేశ పెడతారు. సుదీర్ఘంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు చర్చ జరిగే అవకాశం వుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
యువతులపై ప్రేమోన్మాదంతో యాసిడ్ దాడులు, కత్తులతో పొడవడాలు, హత్యాయత్నాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఒక యువతి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది.
రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు స్వరూపం, అదేనండి ఒరిజనల్ రూపం బయటపడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది. ముగ్గురు మంత్రుల పర్యటనల నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతను తలపిస్తోంది.
రంజాన్ పర్వదినం రోజున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కు అవమానం జరిగింది. రంజాన్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్నారు.