ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.సవిత మంగళవారం (నంబర్ 3) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు, అభివృద్ధికి ఏకపక్షంగా పట్టం కట్టారన్నారు. చొక్కా మడతపెడతానంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన బెదిరింపులకు రాష్ట్ర ఓటర్లు తమ తీర్పుతో గట్టి సమాధానమిచ్చి, ఆయన రాజకీయ ఉనికినే మడతపెట్టి పక్కన పడేశారన్నారు.
పెనుకొండ పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 23 వార్డులతో పాటు చైర్మన్ స్థానాన్ని కూటమి అభ్యర్థులు తమ ఖాతాలో వేసుకోవడం చారిత్రాత్మక విజయమన్న మంత్రి సవిత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచాయన్నారు. సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతుండటంతో పట్టణ ఓటర్లు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించి తమ ఆదరాభిమానాలను చాటుకున్నారని చెప్పారు.
పురపాలక పోరు ముగిసిన అనంతరం పెనుకొండ పట్టణ వీధుల్లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మంత్రి సవిత పాల్గొని నగర పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రివేంద్రమూర్తితో పాటు విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లను ఆమె ప్రత్యేకంగా అభినందిస్తూ సత్కరించారు.
[Penukonda Municipal Election Victory Rally, TDP Janasena BJP Alliance Penukonda, Minister Savitha, AP Local Body Polls, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/penukonda-municipal-election-victory-rally-43-236185.html
క్లీన్ స్వీప్ చేసిన పసుపు పార్టీ.!
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన 15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ 5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇతరులు 3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై 4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా చర్యలు తీసుకున్నారు.
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో తుఫాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.