కుప్పంలో టీడీపీ ప్రభంజనం..32కు 32 వార్డులు కైవసం.!

Publish Date:Nov 3, 2026

Advertisement

క్లీన్ స్వీప్ చేసిన పసుపు పార్టీ.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే సొంత అడ్డా అయిన కుప్పంలో టీడీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించి, తిరుగులేని రీతిలో క్లీన్ స్వీప్ నమోదు చేశారు. 

ఎన్నికల ముందు నుంచే ఉత్కంఠ రేకెత్తించిన ఈ పోరులో, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడింది. మొత్తం 32 వార్డుల్లో పోటీ జరిగిన ఈ ఎన్నికల్లో, ముందుగానే 11 వార్డులను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం విశేషం. దీనితోనే అక్కడ కూటమి హవా ఏ స్థాయిలో ఉందనే స్పష్టత వచ్చింది. ఇక మిగిలిన స్థానాలకు జరిగిన పోరులోనూ పసుపు జెండా అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలను ప్రదర్శించారు. ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే కుప్పం పట్టణంలో తెలుగుదేశం  కూటమి శ్రేణులు సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకున్నాయి. 

పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. గతంలో కుప్పంలో ఎదురైన కొన్ని రాజకీయ పరిణామాలకు చెక్ పెడుతూ, ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడికి  అభివృద్ధి అజెండాకు తిరుగులేని మద్దతును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్ ఉపఎన్నికలు మరియు ఫలితాలలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణకు ఈ విజయం ఒక చక్కటి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏకంగా 32 స్థానాలకు 32 స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంతో కుప్పం గడ్డపై టీడీపీ సత్తా మరోసారి బలంగా చాటబడింది.   

 

 

 

[ Kuppam municipal elections, TDP clean sweep, CM Chandrababu, 32 wards results, AP local body polls, Kuppam results, Naralokesh, YS Jagan, YSRCP, Telugu One, Telugu One ]


 

By
en-us Political News

  
పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు సాధించిన   విజయాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  మంత్రి ఎస్.సవిత మంగళవారం మీడియాతో  మాట్లాడారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ  , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై   4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో  విజయం సాధించారు.  
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో  పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.