పెన్నానదికి పెనుముప్పు ఒకవైపు జలచౌర్యం మరోవైపు
Publish Date:Apr 3, 2012
Advertisement
పెన్నానదికి పెనుముప్పు వాటిల్లింది. ఈ నదిలోని నీటిని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు అనేక కంపెనీలు అక్రమంగా తోడే స్తున్నాయి. మరోవైపు బండల పాలిష్ ఫ్యాక్టరీల నుంచి వెలువడు తున్న వ్యర్థాలన్నీ పెన్నానదిలో కలిపేస్తుండడంతో ఆ నీళ్ళు కలుషిత మయ్యాయి. తాడిపత్రి సమీపాన గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పెన్నా నది గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా నాఉగు అధిక సామర్థ్యం కలిగిన మోటారు బోర్లను ఏర్పాటుచేసి నిత్యం లక్షలాది గ్యాలన్ల నీటిని తోడేస్తుంది. ఈ జలచౌర్యంపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. గతంలో పెన్నానదిలో మూడు అడుగుల లోపే నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు వంద అడుగుల లోతు బోర్లు వేసినా చుక్కనీరు రావడం లేదు. అసలే ఈ నదిలో జలాల లభ్యత అరకొరగా ఉంది. అయితే ఈ కొద్దిపాటి నీటిని కూడా బండల పాలిష్ ఫ్యాక్టరీలు కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా ఈ నీరు తాగడానికి పనికిరావడం లేదు. నీటిని తాగుతున్న పశువులు రోగాల బారినపడుతున్నాయి. సాగునీటికి తగినంత నీరులేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/penna-river-24-13107.html





