వైఎస్ కు బొత్స అనుకూలమా? వ్యతిరేకమా?
Publish Date:Apr 13, 2012
Advertisement
పిసిసి నేత భోత్స సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అనుకూలమా? వ్యతిరేకమా? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అర్థంకాకుండా వుంది. అవినీతి, అక్రమాలకూ సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి బొత్స సత్యనారాయణ "తెరవెనుక జరిగిన అంశాలకు మంత్రివర్గానికి సంబంధం లేదు'' అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా మంత్రిమండలి తెరవనుక జరగకూడని పనులు జరిగినట్టుగాను, రాజశేఖరరెడ్డిని తప్పుపడుతున్నట్టు అర్థం అవుతోంది. కాని అక్రమ ఆస్తులు, అవకతవకల విషయంలో జగన్ తో కలిసి రాజశేఖరరెడ్డిని విమర్శించాడానికి ఆయన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బొత్స అనుసరిస్తున్న ఈ ద్వంద్వవైఖరి అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా ఇటు కాంగ్రెస్ లోని కార్యకర్తల కు కూడా అంతుపట్టకుండా వుంది. సర్వే సత్యనారాయణ, హర్షకుమార్, వి.హనుమంతరావు, వీరశివారెడ్డి వంటి నేతలతో పాటు తాజాగా చిరంజీవి కూడా జగన్ ను, వై.ఎస్.రాజశేఖర రెడ్డిని వేరుగా చూడలేమని వ్యాఖ్యానించారు. కొంచెం నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ లో మెజారిటీ రెడ్డి వర్గం, వై.ఎస్. హయాంలో మరచిపోలేని రీతిలో సహాయం పొందిన సాయి ప్రతాప్, రఘువీరా రెడ్డి వంటివారు వైఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలంగాణా ప్రాంతంలో మెజారిటీ నేతలతో పాటు బిసిలు, ఎస్ సి వర్గాలకు చెందిన వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వై ఎస్ కు వ్యతిరేక అనుకూల ధోరణి ఉప ఎన్నికల తర్వాత కొత్త రూపుదిద్దుకొంటుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో జగన్ వర్గం మెజారిటీ స్థానాలు సంపాదించే పక్ష్హంలో నేడు కాంగ్రెస్ లో వుండి వై.ఎస్.కు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేతలలో కొందరు లాంగ్ జంప్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
http://www.teluguone.com/news/content/pcc-chief-botsa-satyanarayana-24-13346.html





