పాయకరావు పేట కాంగ్రెస్ టికెట్ కై పోటా పోటీ
Publish Date:Apr 9, 2012
Advertisement
విశాఖజిల్లా పాయకరావు పేట ఉప ఎన్నికల్లో కాంగ్రస్ టికెట్ కోసం ఇద్దరు వైద్యులు తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరిద్దరికీ ఉత్తరాంద్రకు చెందిన ఇద్దరు మంత్రులు అండగా నిలుస్తున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి కాంగ్రెస్ టిక్కెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిక్కెట్ ను ఆశిస్తున్న వైద్యుల్లో ఒకరైనా డాక్టర్ బంగారయ్య విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో సివిల్ సర్జన్ ఆర్.ఏం.ఓగా పనిచేస్తున్నారు. మరో ఆశావహుడు డాక్టర్ తాతారావు ఇఎన్ టి ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేస్తున్నారు.బంగారయ్యకు వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి, తాతారావుకు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ తాతారావు గతంలో గంటా శ్రీనివాసరావు సహాకారంతో పిఆర్ పి టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన కూడా కాంగ్రెస్ టిక్కెట్ అశిస్తునారు. ఇమెగతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇమే చీల్చిన ఓట్లతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండుసార్లు పరాజయం పాలయింది. ఈసారి అమెకు టిక్కెట్ లభించకపోతే ముచ్చటగా మూడోసారి కూడా రేబల్ గా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్దికి ముప్పు తెస్తుందని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/payakarao-peta-24-13261.html





