మళ్లీ ఝలక్ ఇచ్చాడుగా... నేను రాను...

Publish Date:Apr 16, 2018

Advertisement


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వామపక్షాలకు షాకిచ్చారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గతంలోనే పవన్ వల్ల వామపక్షాలకు షాక్ తగిలింది. బీజేపీతో చేయి కలిపే పవన్ టీడీపీ విషయంలో యూటర్న్ తీసున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత అని పార్టీలకు దూరంగా ఉంటూ ఆఖరికి వామపక్షాలతో కలిశారు. వారితో ఉంటూనే ప్రత్యేక పోరాటం చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు.. దానికి తగిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా చాలు అని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు విన్న వామపక్షాలు ఖంగుతిన్నాయి. పవన్ ఇలా మాట్లాడేశాండేంటి అని షాక్ తిన్నారు. అనవసరంగా పవన్ తో చేయి కలిపినట్టున్నాం అని కూడా చర్చించుకున్నట్టు సమాచారం. అయితే తాను అలా మాట్లాడలేదని.. తన వ్యాఖ్యాలను వక్రీకరించారని చెప్పుకొచ్చారనుకోండి.

 

ఇక ఇప్పుడు మరోసారి పవన్ వామపక్షాలకు షాకిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా పవన్, వామపక్షాలతో కలిసి మొన్నీమధ్యే విజయవాడలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందుకు మంచి రెస్పాన్స్ రావడంలో వామపక్షాల నాయకులు కూడా సంబరపడిపోయారు. అయితే ఇలాంటి ఆందోళనలు విజయవాడలో కాకుండా ఢిల్లీలో చేపడితే మంచి ఫలితం ఉంటుందని… పవన్ అందులో పాల్గొంటే జనసేన, వామపక్షాల కూటమికి పొలిటికల్ మైలేజీ వస్తుందని వామపక్షాలకు చెందిన నాయకులు భావించారట. అనుకున్నదే తడవుగా...ఢిల్లీలో ఆందోళనలు చేపట్టాలని వామపక్షాలు ప్లాన్ చేసి..ఢిల్లీ స్థాయిలోని తమ అధిష్టానంతో కూడా వామపక్షాల నాయకులు చర్చలు కూడా జరిపారట. అయితే దీనికి పవన్ నో చెప్పారట. దీంతో పవన్ నిర్ణయంపై వామపక్ష నేతలు షాకయ్యారట. ఈ విషయంలో పవన్ ఎందుకు వెనకాడుతున్నాడో అర్థం కావడం లేదని తలపట్టుకుంటున్నారట. పాపం మరి ఏదో పవన్ తో కలిసి జనంలోకి వెళితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓ నాలుగు సీట్లు వస్తాయని వామపక్ష నేతలు ఆశపడుతున్నారు కానీ పవన్ మాత్రం వారికి షాకులిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు వామపక్షాలు ఏం చేస్తారో చూద్దాం...

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.