రోజూ చెమట పట్టనివారికి… ముచ్చెమటలు తప్పటం లేదు!

Publish Date:Jul 1, 2017

Advertisement

 

ఒకప్పుడు మన దేశంలో ఊహించటానికి కూడా వీలు లేని చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో అత్యంత ఆందోళకర అంశం… అధిక బరువు! భారత్ వేల సంవత్సరాలుగా వ్యవసాయ ప్రధాన దేశం. మన దగ్గర పోతన లాంటి కవీశ్వరులు కూడా నాగలి పట్టి దున్నారు. సీతమ్మ వారు జనకుడికి పొలం దున్నుతుంటేనే లభించింది! ఇక శ్రీకృష్ణుడి అన్న బలరాముడికి ఆయుధం… నాగలి. అంతగా వ్యవసాయం మన సంస్కృతిలో భాగంగా వుండేది. రాజుల నుంచి పేదల దాకా అందరూ మట్టిలో , బురదలో శ్రమించి పని చేసేవారు! బహుశా అందుకేనేమో గతంలో ఎప్పుడూ మన దగ్గర అధిక బరువు ఒక సమస్యగా మారలేదు. ఎవరో కొందరు స్థూల కాయులు ఎప్పుడూ వున్నప్పటికీ సమాజం మొత్తం తల పట్టుకుని కూర్చునేలా అందరికందరూ లావైపోవటం ఎప్పుడూ జరగలేదు! కాని, ఇప్పుడు అదే జరుగుతుండటం ఆలోచించాల్సిన విషయం!

 

సాధారణంగా మనకు ఇంతకు ముందు వున్నంతగా శరీర శ్రమ వుండటం లేదు. కాని, మనస్సు పైన తీవ్రమైన ఒత్తిడి వుంటోంది. ఈ రెండూ కలిసి వయస్సుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడుతున్నా కోట్లాది భారతీయులు. ఇందులో మామూలు వారే కాదు సెలబ్రిటీలు కూడా బోలెడు మంది వున్నారు. అత్యంత తాజాగా దాసరి నారాయణ రావు అనూహ్య పరిస్థితిలో స్వర్గస్తులయ్యారు. ఆయనకు చాలా రోజులుగా ఏదో ఆనారోగ్యం వున్నట్టుగా కూడా ఎవ్వరూ వినలేదు. కాని, కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలో చనిపోయే స్థితి దాపురించింది. ఇందుకు కారణం… అధిక బరువుతో వచ్చిన ఒత్తిడేనంటే నమ్ముతారా?

 

దాసరి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని , వికటించి మరణించారంటే మొదట్లో ఎవరో నమ్మలేదు. కాని, ఆయనకు ఆప్తుడైన మరో దర్శకుడు రేలంగి నరసింహారావు అదే విషయాన్ని ధృవీకరించారు! దాసరి బరువు తగ్గటానికి చికిత్స తీసుకుని , అది సరిగ్గా కుదరక మరణించారంటున్నారు ఆయన! దీన్ని ఒప్పుకోని వారు కూడా వుంటే వుండొచ్చు కాని… ఆ మధ్య ఆర్తి అగర్వాల్ కేసైతే అందరికీ తెలిసిందే! ఆమె కూడా అధిక బరువు వల్ల బాధపడి ప్రాణాంతక ట్రీట్మెంట్ తీసుకుని మనకు దూరమయ్యారు!

 

మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ అధిక బరువు తగ్గించుకునే రిస్క్ ఏం చేయలేదు కాని… ఆయనకు గుండెపోటు రావటానికి ఓవర్ వెయిటే కారణమని కొందరు వాదిస్తుంటారు. ఇలా అందరికీ తెలిసిన సెలబ్రిటీలు అధిక బరువుతో మృత్యు వాత పడితే మనకు తెలుస్తుంది. కాని, సామాన్యుల పరిస్థితి ఏంటి? మారిపోయిన లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనేక రోగాలకు బలవుతున్నారు. వాటిలో చాలా వాటికీ కారణం అధిక బరువే. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవటం ప్రాణాలు తీసేదాకా వెళుతుంది. అలాగని సాహసం చేసి వివిధ రకాల సర్జరీలు, చిక్సిత్సలతో కొవ్వు తీయించుకున్నా… అదీ ప్రమాదకరంగానే పరిణమిస్తోంది! ఇలా ఊరుకున్నా, ఉద్రేకపడినా ఇబ్బందిగా మారిపోయింది ఓవర్ వెయిట్!

 

ఏదో చూడటానికి బాగా వుండమనో, లేక రోజువారీ పనులు చేసుకోటం కూడా కష్టమవుతుందనో మనం అధిక బరువు తగ్గాల్సిన అవసరం లేదు. కాని, అవసరానికి మించి బరువు వుండటం వల్ల జీవితమే నిరాశా,నిస్పృహలతో నిండిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే, కొన్నేళ్లకు మన బరువే మన శత్రువుగా మారి ఆయుష్షు తగ్గించేస్తుందంటున్నారు. అయితే, దీనికి ఉచిత పరిష్కారం కూడా ఉచితంగానే చెబుతున్నారు నిపుణులు. బాబా రాందేవ్ లాంటి యోగా గురువులు మొదలు డైటీషన్లు, ఫిట్ నెస్ ఎక్సపర్ట్స్  అందరూ ఒకటే అంటున్నారు. యోగాతోనో, జిమ్ లోనో, పరుగులు పెట్టటానికి వీలుగా వుండే గ్రౌండ్లోనో… ఎక్కడో ఓ చోట, లేదంటే ఇంట్లోని ట్రెడ్ మిల్ పైనా… ఎక్కడైనా, ఎలాగైనా కొవ్వు కరిగించమంటున్నారు! మందులు, చిక్సిత్సలకంటే ఒళ్లు వంచి శ్రమపడటం చాలా సేఫ్ అండ్ గ్యారెంటీ అంటున్నారు!

 

ఎవరికైతే చెమట పట్టడం లేదో… వారికి అధిక బరువు ముచ్చెమటలు పట్టిస్తుందనేది… ఇప్పటి మన ఏసీల కాలపు సుఖమైన ఆధునిక జీవన సత్యం!

By
en-us Political News

  
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.