Publish Date:Aug 23, 2012
ఒకప్పుడు సినిమాలంటే ఇంటిల్లిపాది కూర్చుని ఆనందంగా చూసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో కలిసిచూడాలన్నా, తోబుట్టువులతో చూడాలన్నా ఆలోచించాల్సి వస్తున్న రోజులివి. అలా వుంటున్నాయి నేడు అధిక సినిమాలు. వీటికి తోడు సంఘంలో అన్ని వృత్తులపైన, వ్యక్తుల మీద చులకన భావం పెరిగిపోతోంది. తల్లిదండ్రులను కూడా సినిమాల్లో పేర్లతో పిలిపిస్తూ అదో కొత్తదనంగా చూపించే రోజులివి. సంఘంలో ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ, అర్చక తదితరాలను సైతం హాస్యంపేరుతో వ్యంగ్యాన్ని జతచేసి సినిమాల్లో పాత్రలను రూపొందించడంతో వాటి ప్రభావం వల్ల యువతలో ఆయా వృత్తులలోని వ్యక్తులపై సైతం చులకనభావం నెలకొంది. తల్లిదండ్రులతో సమానమైన గౌరవాన్ని పొందే ఉపాధ్యాయ వృత్తికి సైతం ఆ జాఢ్యాన్ని అంటించి యువతను ఆకర్షించేందుకు, పలురకాల అసభ్య, అవమానకరరీతిలో పేర్లను పెడుతూ సినిమాలను తీయడం అన్నది ఎంతవరకు సమంజసమో ఆయా చిత్ర దర్శకనిర్మాతలు ఆలోచించాలి. అటువంటి సినిమాలు తయారుచేయడం, దానిపై ఆందోళనలు నేడు పరిపాటిగా మారిపోతోంది. నైతికవిలువలన్నది సినిమా తీసే వారికి ముఖ్యమన్నది పెద్దలమాట. సినిమాల్లో సంఘంలో గౌరవప్రదమైన వృత్తులను హాస్యంపేరుతో చులకనగా చూపించకుండా, అటువంటి హాస్యాన్ని సినిమాల్లో లేకుండా పరిశ్రమలోని పెద్దలు ఆలోచించాలని, ఆదాయమే ప్రధానమైన ధ్యేయంతో సినిమాలు నిర్మించవద్దని మంచిని కోరుకునే సగటు ప్రేక్షకుని విన్నపం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-suitable-movies-to-view-along-with-family-members-nowadays-24-16790.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!