అమెరికాలో మాజీ ప్రియురాలి హత్య.. ఆగ్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్..!

Publish Date:Aug 28, 2026

Advertisement

 

8 నెలల తర్వాత మర్డర్ కేసులో పురోగతి..!

అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ(27)ను తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిఖిత హత్య అనంతరం భారత్‌కు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శర్మ.. ఆగ్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఆగస్టు 24న అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.అమెరికా దర్యాప్తు సంస్థల అభియోగాల ప్రకారం నిఖిత, అర్జున్ శర్మ గతంలో సన్నిహితంగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. 2025 డిసెంబర్ 31న నిఖితను తన అపార్ట్‌మెంట్‌కు శర్మ పిలిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తన వద్ద ఉన్న 4 వేల డాలర్లను తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను అపార్ట్‌మెంట్‌కు రప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నిఖిత హత్యకు గురైనట్లు అమెరికా పోలీసులు గుర్తించారు.


నిఖిత మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌లోని ఓ సూట్‌కేసులో గుర్తించినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిఖితకు చెందిన క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బులు తీసుకున్నట్లు కూడా అర్జున్ శర్మపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఖిత హత్య వెనుక వేల డాలర్లకు సంబంధించిన ఆర్థిక వివాదం కారణమై ఉండొచ్చన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నా యి. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నిఖిత హత్య అనంతరం అర్జున్ శర్మ అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు అక్కడి దర్యాప్తులో తేలింది. దీంతో అతడిపై అమెరికా అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. 


మరోవైపు హైదరాబాద్‌ లోని లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ శర్మపై కేసు నమోదైంది. అతడి కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆచూకీని గుర్తించారు. శర్మ ఆగ్రాలో ఉన్నట్లు నిర్ధారించిన తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా అభ్యర్థన మేరకు నిందితుడిని అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


నిఖిత హత్య కేసులో అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ హత్యతో పాటు దాడికి సంబంధించిన అభియోగాలను అమెరికా అధికారులు నమోదు చేశారు. కేసులో నిందితుడు భారత్‌లో పట్టుబడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. అర్జున్ శర్మ అరెస్టుపై నిఖిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె హత్య కేసులో నిందితుడు పట్టుబడటం కొంత ఊరటనిచ్చిందని తెలిపారు. అయితే నిఖిత హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, హత్యకు ముందు ఏం జరిగింది, అర్జున్ శర్మతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు తెలియలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిఖిత మరణం వెనుక ఆర్థిక వివాదం ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు వినియోగం తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. భారత్, అమెరికా దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని నిఖిత కుటుంబం డిమాండ్ చేసింది. నిఖితను 4 వేల డాలర్ల వ్యవహారంపై అపార్ట్‌మెంట్‌కు ఎందుకు పిలిచారు? ఆ తర్వాత ఏం జరిగింది? హత్య అనంతరం ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆర్థిక లావాదేవీలకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అర్జున్ శర్మను భారత్ నుంచి అమెరికాకు అప్పగించే ప్రక్రియ పూర్తయితే ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

Nikhitha Godisha murder case, Agra, Arjun Sharma,  America, Hyderabad, CP Sajjanar, CM Revanth reddy Telugu news, Telugu One

By
en-us Political News

  
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.