రాఖీ రాజీ కుదిర్చేసినట్లేనా?

Publish Date:Aug 28, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో తీవ్ర సంచలనం సృష్టించిన కొండా సురేఖ వ్యవహారం ఇక క్లోజ్ అయినట్లేనా? టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించినా, పార్టీ ఆమె పట్ల ఒకింత సానుకూలంగానే ఉందా? ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ తీరు పట్ల కాంగ్రెస్ నాయకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో కేబినెట్ నుంచి ఆమెను బర్త్ రఫ్ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కట్ చేస్తే రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 

గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ కుటుంబానికి,  సీఎం వర్గానికి మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మంత్రి సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా, పార్టీ క్రమశిక్షణా కమిటీ  సురేఖపై చర్యకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయన నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం   హాట్ టాపిక్‌గా మారింది.

రక్షాబంధన్ పండుగ వేళ సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీకగా సీఎంకు రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్ కోరిన సురేఖ.. అనుకున్న సమయానికి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని  రేవంత్ రెడ్డికి ఆమె రాఖీ కట్టారు. దీంతో ఇటీవలి కాలంలో  ముఖ్యమంత్రికి, కొండా సురేఖకు మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.  దీంతో కేబినెట్ లో ఆమె స్థానానికి ఇప్పట్లో ఢోకా లేదన్న మాట కూడా వినిపిస్తోంది. 
  

(Konda Surekha, Revanth Reddy, Telangana Congress Controversy, Raksha Bandhan, Konda Surekha Rakhi CM Revanth, Telangana Politics, Telugu One) 

By
en-us Political News

  
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.