శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గ్రామాల్లో కార్యకర్తల ద్వారా చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. కాలింగ, ఎస్సే సామాజికవర్గం ఓట్లపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఈయన ప్రచారానికి పెద్దసంఖ్యలో కార్యకర్తల మద్దతు లభిస్తోంది.
టిడిపి అభ్యర్థి గెలుపు బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు తీసుకున్నారు. నియోజకవర్గంలో 900మందితో డెడికేటెడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన కె.ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాం, గౌతు శ్యామసుందర శివాజీ, అచ్చెంనాయుడు తదితరలు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మాన ప్రసాదరావు, తమ్ముడు ధర్మాన్ రాందాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల బాధ్యతను మంత్రి ధర్మానప్రసాద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ముఖ్యమైన నాయకులను గ్రామాలకు పంపించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 150 పంచాయితీలకు ప్రత్యేకంగా ఇన్ ఛార్జిలను నియమించారు. ఈ మూడు పార్టీలు నసరన్నపేట ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం గట్టిగా శ్రమిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/narasannapeta-assmebly-constituency-of-srikakulam-district-24-13808.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.