ముద్రగడ పవన్‌ని అంత మాటనేశాడేంటీ?

Publish Date:Feb 13, 2018

Advertisement

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ముమ్మరం చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా వున్నవారికి ఆయన ఇప్పుడు కల్పవృక్షంలా కనిపిస్తున్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు జనసేన నీడన చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ పార్టీకి సన్నిహితంగా వుండాలా అని ఎదురుచూస్తున్న ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్‌కి చేరువవుతున్నారు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌ని కలసి మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రముఖులు తమ నాయకుడికి చేరువ కావడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమాన జనాలు, జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇలా హ్యాపీగా ఫీలవటం సూది దొరికిందన్న ఆనందంలో గడ్డపలుగు పోయిందనే విషయాన్ని పట్టించుకోనట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కి దగ్గరవుతున్నారు ఓకే.. బాగానే వుంది.. కానీ మరో ప్రముఖుడు పవన్ కళ్యాణ్‌కి దూరమవుతున్నారు.. ఆ విషయాన్ని జనసేన వర్గాలు లైట్‌గా తీసుకుంటున్నాయి.

 

ఎవరు అవునన్నా, కాదన్నా పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన ప్రధాన బలంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య చాలా ఎక్కువ. గతంలో ఈ సామాజికవర్గం వారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మీద ఆశలు పెట్టుకుని భంగపడ్డారు. ఇప్పుడు పవన్ మీద ఆశలు పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా తమను భంగపడేలా చేస్తాడా అనే అనుమానాలు వీరిని బలంగా పీడిస్తున్నాయి. అలా అనుమానిస్తూనే, పవన్ వెంట నడుస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కలుపుకుని వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ముద్రగడ పవన్ కళ్యాణ్‌తో కలసి నడవటానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల ఒక బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాపులకు పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ వుండదని, కాపులకు పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబే న్యాయం చేస్తారన్న నమ్మకం వుందని ముద్రగడ ప్రకటించారు. ముద్రగడ చేసిన ఈ ప్రకటన కాపు సామాజిక వర్గం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి, జనసేన వర్గాలకి ఇంకా అర్థమైనట్టు లేదు.

By
en-us Political News

  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.