ఫిర్యాదుల వెల్లువతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న భన్వర్ లాల్
Publish Date:Jun 4, 2012
Advertisement
రాష్ట్రంలోని ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీరని హడావుడిగా ఉంటోంది. ఒకవైపు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండో అంకమైన ప్రచారపర్వం మరో వారం తరువాత ముగియనుంది. ఈలోపు అభ్యర్థుల ఖర్చులు, ప్రచార సమయంలో అతిక్రమించే నిబంధనలు వంటి వాటిని కమీషన్ పరిశీలిస్తోంది. ఈ సమయంలో హడావుడిగా వచ్చి ఒక పార్టీ నేతలు ఇతర పార్టీలపై ఫిర్యాదు చేస్తునారు. అది మా దృష్టికి రానీయండి మేము పరిష్కరిస్తామని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ సర్ది చెబుతున్నా పార్టీల నేతలు వినటం లేదు. పైగా,మీరేమైనా ఆ పార్టీలకు కొమ్ముకాస్తున్నారా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆయన, సిబ్బంది కూడా తలపట్టుకు కూర్చుంటున్నారు.
కాంగ్రెస్ నాయకుల అక్రమాలకు చెక్ పెట్టాల్సిందేనని చెబుతూ రోజూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వస్తున్నారు. జగన్ తనపై ఉన్న కేసు సంగతెలా ఉన్నా ఎన్నికల కమిషనర్ ను ప్రసన్నం చేసుకోవాలని వై.కా.పా. నేతలకు సూచించారట. దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆ పార్టీలోని నేతలందరూ దాదాపుగా పరిచయమయ్యారు. వారిని ఆయన పేరు పెట్టి పిలవగలిగేంత పరిచయం ఏర్పడిందని ప్రధానాధికారి కార్యాలయ సిబ్బంది తేట తెల్లం చేస్తున్నారు. వీరిని చూసి కాంగ్రెస్, బిజెపి తదితర పార్టీలు కూడా తమ ప్రత్యర్థులపై ఫిర్యాదు చేస్తూ ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వెడుతున్నారు. వీరందరి వల్ల కార్యాలయంలో పనిభారం పెరుగుతోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-24-14596.html





