సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ..!

Publish Date:Aug 28, 2026

Advertisement

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది. ఇటీవల ముఖ్య మంత్రి కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యల నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖకు రాఖీ పండుగ కాస్త ఊరటనిచ్చినట్టయింది. కొద్ది రోజులుగా వరంగల్‌లోనే ఉన్న మంత్రి సురేఖ.. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. మంత్రి సీతక్క కూడా సీఎంకు రాఖీ కట్టారు. ఇటీవల చోటుచే సుకున్న పరిణామాలతో రాజకీయ వర్గాల్లో కొంత గంభీర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఒకే వేదికపై కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ సందర్భంగా వారి ముఖా ల్లో చిరునవ్వులు కనిపించడంతో వాతావరణం కొంత ఉల్లాసంగా మారినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు కూడా రాఖీ కట్టారు.  వివిధ కార్పొరే షన్‌ల చైర్మన్లు, బ్రహ్మకు మారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు సీఎంను కలిసి రాఖీ పండుగ శుభాకాం క్షలు తెలిపారు. మలక్‌పే ట్‌లోని ప్రభుత్వ బాలికల అంధుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయం గా పలకరించారు. రాజకీయంగా కీలక పరిణామాల మధ్య వచ్చిన రాఖీ పండుగ.. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సాన్నిహిత్యాన్ని చాటే సందర్భంగా మారిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

 

Ministers Seethakka, Konda Surekha tied Rakhi to CM Revanth Reddy, Rakhi festival, Jubilee Hills, Commission Chairperson Gadwala Vijayalakshmi, Malakpet, Hyderabad, Telugu news, Telugu one 

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.