ఎమ్మెల్సీని వణికించిన ‘డీప్‌ఫేక్’ బెదిరింపులు..!

Publish Date:Aug 28, 2026

Advertisement

 

రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను టార్గెట్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను బయటపెడతామంటూ హెచ్చరించడం కలకలం రేపింది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్సీకి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో బయటపెడతామని దుండగులు హెచ్చరించినట్లు తెలిసింది. 

అంతేకాకుండా కుటుంబ పరువుకు భంగం కలిగించడంతో పాటు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తామని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలంటూ పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్, డబ్బులు డిమాండ్ చేసిన విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? డబ్బుల కోసం ఉద్దేశపూర్వకంగా బెదిరింపులకు పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కాల్ చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్లు, కాల్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. .డీప్‌ఫేక్ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన ఈ ఘటన.. సైబర్ నేరగాళ్లు రాజకీయ ప్రముఖులను సైతం ఎలా టార్గెట్ చేస్తున్నారనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

 

MLC Mirza Rehmat Baig receives deepfake threats, MIM MLC, Cybercrime police, Deepfake technology, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.