మేకపాటిది మేకపోతు గాంభీర్యమేనా?

Publish Date:Mar 6, 2012

Advertisement

హైదరాబాద్: వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి జగన్ కు కీలక మద్దతుదారుడుగా నిలిచారు. ఆయన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఆమోదించడంతో నెల్లూరు లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలువనున్న మేకపాటి తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు లభించిన అన్ని మెజారిటీలను అధిగమిస్తాననే గట్టి నమ్మకంతో వున్నారు. అయితే మేకపాటిది మేకపోతు గాంభీర్యమేనని వచ్చే ఎన్నికల్లో ఆయన అసలు గెలువగలిగితే గొప్పేనని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు గట్టి నాయకుల బలం ఉంది. కెడర్ కొంత జగన్ పార్టీవైపు వెళ్ళినప్పటికీ వచ్చే కొద్ది నెలల్లో వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఖాయమని, ఇదే జరిగితే మేలపాటి పరాజయం తప్పదని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.


మేకపాటి 1983లో మొదటిసారిగా జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బిజెపి నేత వెంకయ్యనాయుడుతో పోటీపడి పరాజయం పాలయ్యారు. 1985లో వచ్చిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మేకపాటి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి టిడిపి అభ్యర్ధి ఖమ్మం విజయరామిరెడ్డిపై గెలుపొందారు.1989 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా పోటీచేసి 97వేల మెజారిటీతో విజయం సాధించారు. తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డితో రాజకీయ వైరం తెచ్చుకుని కాంగ్రెస్ కు దూరమై తెలుగుదేశం పార్టీలో చేరారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి టిడిపి తరపున పోటీచేసి మాగుంట పార్వతమ్మ చేతిలోనూ, తరువాత 1998  మధ్యంతర ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేతిలోనూ ఓడిపోయారు. దీంతో ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 2004 ఎన్నికల్లో రాజమోహనరెడ్డి నర్సరావుపేట ఎంపిగా పోటీచేసి 85వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009 ఎన్నికలనాటికి నియోజకవర్గాల పునర్విభజనతో సొంత ప్రాంతమైన నెల్లూరు నుంచి పోటీచేసి గెలుపొందారు. గెలుపు ఓటములు సమానంగా ఉన్న మేకపాటికి వచ్చే  ఎన్నికల్లో విజయావకాశాలు కూడా ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.