కొల్లాపూర్ కాంగ్రెస్ కోటకు బీటలు?

Publish Date:Mar 6, 2012

Advertisement

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో  ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జూపూడి కృష్ణారావుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మంత్రి కూడా అయ్యారు. తెలంగాణా వాదం పేరుతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు గట్టి బీటలే పడ్డాయి.


కొల్లాపూర్ నియోజకవర్గం 1952లోఏర్పాటైంది. నాటినుంచి పాలకులు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి మాత్రం పెద్దగా జరగలేదు. 1952లో పిడిఎఫ్ అభ్యర్ధిగా వామపక్షాలు బలపర్చిన రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగదాసు 1,342 ఓట్ల తేడాతో సిపిఐ అభ్యర్ధి జి. రావును ఓడించారు.1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి బి. నర్సింహారెడ్డి రంగదాసు పై 1.572 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగదాసు 1,342 ఓట్ల తేడాతో సిపిఐ అభ్యర్ధి జి.రావును ఓడించారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి బి.నర్శింహారెడ్డి రంగదాసుపై 1.572 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన రంగదాసు కొత్త వెంకటేశ్వరరావుపై 3,556 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1978లో  కొత్త వెంకటేశ్వరరావు రంగదాసుపై 14వేల మెజారిటీతో గెలుపొందారు. 1983లో కొత్త వెంకటేశ్వరరావు టిడిపి కి చెందిన వికె రెడ్డిపై సుమారు 13వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1985లో కొత్త వెంకటేశ్వరరావు సిపిఐ అభ్యర్ధి సురవరపు సుధాకరరెడ్డిపై 2,499 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి సుధాకర్ రెడ్డిని 9,159 ఓట్ల తేడాతో ఓడించారు.1994 లో కె. మధుసూదనరెడ్డి కొత్త రామచంద్రారెడ్డి కొత్త రామచంద్రారెడ్డిపై 33,774 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1999లో జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), మధుసూదనరావు (టిడిపి)పై 5,304 ఓట్ల తేడాతో విజయం సాధించారు.2004, 2009 ఎన్నికల్లో కూడా జూపల్లి ఇదే నియోజకవర్గం నుంచే గెలుపొందారు.

By
en-us Political News

  
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.