మసీదు కమిటీ వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత ఆత్మహత్య..!
Publish Date:Aug 25, 2026
Advertisement
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత యాదగిరి ముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు మసీదు కమిటీ సభ్యులే కారణమంటూ ఆయన ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసిన అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కావడిగూడ మసీదు సమీపంలో యాదగిరి ముదిరాజ్ కొంత కాలంగా చిన్న షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఆ షాపు, స్థలానికి సంబం ధించి మసీదు కమిటీ సభ్యులతో గత 20 ఏళ్లు గా వివాదం కొనసాగుతోందని ఆయన తన వీడియోలో పేర్కొన్నారు. మసీదు పెద్దలు తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, స్థలాన్ని వక్ఫ్ బోర్డు పరిధిలోకి ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారని యాదగిరి ముదిరాజ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. తనకు న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘటనాస్థలా నికి చేరుకుని మృతదేహా న్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదగిరి ముదిరాజ్ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ వీడియో, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. Masjid Committee, Musheerabad, BJP leader Yadagiri Mudiraj,Waqf Board, CM Revanth reddy, BJP
http://www.teluguone.com/news/content/masjid-committee-24-229822.html





