వద్దు.. వద్దు అంటూనే బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్..!
Publish Date:Aug 25, 2026
Advertisement
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్..! బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మరవకముందే శంషాబాద్ పరిధిలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేసిన వీడియో ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వినూత్నంగా ‘వద్దు.. వద్దు.. సబ్‌స్క్రైబ్ చేయొద్దు’ అంటూ చెబుతూనే.. మరోవైపు బెట్టింగ్ యాప్ గురించి ప్రచారం చేసేలా వీడియో రూపొందించడమే కాకుండా సదరు వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ప్రమోషన్ వెనుక అసలు కథ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేసినందుకు ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు? యాప్ నిర్వాహకులతో అతనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? గతంలోనూ ఇలాంటి ప్రమోషన్లు చేశాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ గతంలో నివసించిన ఊట్పల్లి ప్రాంతంలోనే ఓ బెట్టింగ్ ముఠా పట్టుబడినట్లు సమాచారం. దీంతో ఆ ముఠాతో ఇన్‌ఫ్లుయెన్సర్ కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలి యాల్సి ఉంది. మరోవైపు ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువత ను ఆకర్షించేలా గతంలో ఖరీదైన, విలాసవంతమైన కార్లతో ఫొటోలు, వీడి యోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. కార్లపై ఎక్కి ఫొటోలు దిగడం, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రదర్శించే పోస్టులతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌లకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో.. శంషాబాద్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పోలీసులు దృష్టి సారించారు. Promotion for betting app, Influencer in Shamshabad, Facebook account, Ootpally area, Crime news, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/promotion-for-betting-app-24-229825.html





