కొండా సురేఖ విషయం అధిష్ఠానానికే వదిలేసిన రేవంత్.!

Publish Date:Aug 25, 2026

Advertisement

తెలంగాణ పాలిటిక్స్ లో  తీవ్ర దుమారం రేపిన   మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సారి స్పందించారు.  కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ లో   కలకలం రేపింది. సుస్మిత రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంపై స్పందిస్తూ..   ఈ వివాదాన్ని తాను  స్వయంగా పరిష్కరించబోనని, పార్టీ అధిష్టానం,  క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంటుందనీ స్పష్టం చేశారు.  మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన కొండా సురేఖ, ఆమె కుమార్తె వ్యవహారంపై మాట దాటవేయలేదు. మీడియా ప్రశ్నలకు సూటిగానేరుగా సమాధానం ఇచ్చారు.  

కాంగ్రెస్ లో   పార్టీ క్రమశిక్షణ కంటే ఎవరూ ఎక్కువ కాదని చెప్పిన సీఎం..   తానైనా, మంత్రి సురేఖ అయినా క్రమశిక్షణా సంఘం విధించే నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యతలు లేదా రాజకీయ కోణాలు పనిచేయవని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికి ప్రత్యేకమైన   వ్యవస్థ ఉందని, అనుభవం ఉన్న సీనియర్ నాయకులు క్రమశిక్షణా సంఘంలో ఉన్నారని గుర్తుచేశారు. నేతలు ఎవరైనా గాడి తప్పుతున్నారని వార్తలు వచ్చినా లేదా ఫిర్యాదులు అందినా క్రమశిక్షణా సంఘమే వాటిని  పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను   జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని విస్పష్టంగా చెప్పారు. 

ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  ఆమె వివరణ కూడా ఇచ్చారు.   సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను  జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా   ఈ   వివాదానికి   త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Revanth Reddy leaves Konda Surekha issue to high command,  Telangana Congress, Konda Susmitha, Revanth Reddy Press Meet, Congress High Command

By
en-us Political News

  
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.