దివంగత మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్. వివేకానందరెడ్డి ప్రస్తుతం తీవ్ర నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి పదవిని వదులుకొన్న ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం రాజ్యసభ టిక్కెట్టు కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమైన వివేకా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీ ఆయనను కనీసం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వివేకానందరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఎవరూ కనీసం ఆయన అభిప్రాయాన్ని అడుగలేదని వివేకా అనుచరులు వాపోతున్నారు. ప్రచారానికి కూడా ఆయనను పిలవటం లేదని వారు అంటున్నారు. ఈ పరిణామాన్ని గ్రహించిన వివేకా ప్రస్తుతం పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్. మరణానంతరం తన అన్న కుటుంబాన్ని సైతం దూరం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచానని అందకు ప్రతిఫలంగా కాంగ్రెస్ తనకేమి ఇచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులేవరైనా తన అన్న రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే తాను సహించబోనని ఆయన హెచ్చరిస్తుండడం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/late-ys-rajsekhar-reddy-brother-ys-vivekananda-angry-24-13912.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.