కేటీఆర్ పీఆర్వోపై కేసు.. అసెంబ్లీ వద్ద ఏం జరిగిందంటే..?
Publish Date:Sep 10, 2026
Advertisement
అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్వో మహేష్‌తో పాటు ఆయన పీఏ మహేందర్ రెడ్డిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు.. వారితో దురుసుగా ప్రవర్తించి, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. పోలీసుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆర్‌ఐ జంగయ్య ఫిర్యాదుతో.. కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై BNS 132, 352, 351(2), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలీసులకు మధ్య చోటుచేసుకున్న ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మరో 12 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా కేటీఆర్ పీఆర్వో, పీఏపై కేసు నమోదు కావడంతో.. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు మరింత కీలకంగా మారింది. KTR, KTR PRO Mahesh, Mahesh FIR, Mahender Reddy, BRS, Telangana Politics, Telangana Assembly, Saifabad Police, Assembly Gate No 3, Police Case, BNS Sections, BRS MLAs, KTR, Harish Rao
http://www.teluguone.com/news/content/ktr-24-231158.html





