కొండా సురేఖపై వేటే.!

Publish Date:Aug 25, 2026

Advertisement

తెలంగాణ  కాంగ్రెస్  రాజకీయం ఒక్కసారిగా  హీటెక్కింది. గత కొన్ని రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల పై వేటు తప్పదని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. వీరిద్దరి వ్యాఖ్యలు, వైఖరిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ కమిటీ తన  నివేదికను పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్‌కు  అందజేసింది. ఆ నివేదికలో  కొండా, చిన్నారెడ్డిలపై వేటుకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ తమ నివేదికను పీసీసీ అధ్యక్షుడికి సీల్డ్ కవర్ లో సమర్పించారు.  

పార్టీ నియమావళి, క్రమశిక్షణ  ఉల్లంఘించిన నేతలకు స్పష్టమైన, గట్టి హెచ్చరిక పంపాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో వారు పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ పార్టీ  పార్టీ నియమాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం ఇది మూడోసారి కావడంతో ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ నివేదికలో ప్రస్తావించి.. ఇక ఉపేక్షించడం కరెక్ట్ కాదని పేర్కొన్నట్లు చెబుతున్నారు.  తాజా వ్యవహారంలో కూడా కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను వెంటనే ఖండించలేదని పేర్కొంటూ.. ఆమె తీరును చూసీ చూడనట్లు వదిలేస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెడతాయని నివేదిక విస్పష్టంగా పేర్కొన్నట్ల కాంగ్రెస్ వర్గాల సమాచారం.  

ఇక చిన్నారెడ్డి విషయంలో కూడా కమిటీ చర్యలకు సిపారసు చేసినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్‌లో  చాలా కాలంగా ఉంటూ,   కీలక పదవులు, బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి, ఇప్పుడు కేబినెట్ హోదా ర్యాంకులో ఉండి కూడా పార్టీ అంతర్గత విషయాలను పార్టీ వేదికలపై కాకుండా బహిరంగంగా మాట్లాడటం  సరికాదని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.  

అదలా ఉంటే నివేదిక సమర్పించిన అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన  క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి  కొండా సురేఖ, చిన్నారెడ్డి అందించిన వివరణ లేఖల ఆధారంగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ఆ ఇద్దరు నేతలూ కూడా క్రమశిక్షణ కమిటీని వ్యక్తిగతంగా కలవలేదనీ, తమ ఎక్స్ ప్లనేషన్ ను గాంధీభవన్‌లో  సమర్పించారని చెప్పారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండాలంటే క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉండక తప్పదని మల్లు ఈ సందర్భంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

Konda Surekha, Chinna Reddy, TPCC Disciplinary Committee, Mallu Ravi, Mahesh Kumar Goud, Telangana Congress, eluguOne

By
en-us Political News

  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 
హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది.
హానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.
సిగరెట్‌ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి   శుభాకాం క్షలు తెలిపారు.  అలాగే మంత్రి సోదరులు   అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు.  గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
సీఎం రేవంత్‌తో లండన్ లాలూచీ.. బీజేపీతో హరీశ్ మిలాఖత్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.