పెళ్లి పేరుతో మోసం.. టాలీవుడ్ దర్శకుడు పవన్ అరెస్టు.!
Publish Date:Aug 26, 2026
Advertisement
టాలీవుడ్‌లో మరో వివాదం సంచలనం సృష్టిస్తోంది. అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేనిపై ఒక లేడీ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పవన్ సాధినేని ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం కొద్దిరోజుల్లోనే సన్నిహిత సంబంధంగా మారింది. తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో, ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. అయితే.. ఇటీవల తాను పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పదన్ సాధినేనిని అరెస్టు చేశారు. ప్రేమ ఇష్క్ కాదల్ , సావిత్రి, సేనాపతి, ఆకాశంలో ఒక తార వంటి సినిమాలు, దయ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా పవన్ మంచి గుర్తింపు పొందారు. దర్శకుడిగానే కాకుండా పవన్ ప్రముఖ నిర్మాతలతో కలిసి సినిమాల నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. Tollywood director arrested, Pawan sadhik, Fraud , pretext, marriage
http://www.teluguone.com/news/content/tollywood-director-arrested-24-229914.html





