కంటైనర్ ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం.!
Publish Date:Aug 25, 2026
Advertisement
సూర్యాపేట జిల్లాలో బుధవారం (ఆగస్టు 26) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెడుతున్న ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 42 మంది ప్రయాణీకులు ఉన్నారు. . కోదాడ సమీపంలోని దొరకుంట వద్దకు రాగానే.. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది అతికష్టం మీద బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. Kodada road accident, Suryapet bus crash, Telangana private bus accident, Hyderabad to Eluru bus accident, Kodada news today, National Highway road accident
http://www.teluguone.com/news/content/kodada-road-accident-24-229860.html





