హైకోర్టును ఆశ్రయించిన మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్..!

Publish Date:Aug 25, 2026

Advertisement

 

 మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు నమోదైన అనంతరం సుమంత్ పరారయ్యాడు. హైదరాబాద్‌లోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్‌ను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమంత్ ఓ మంత్రి నివాసంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు సుమంత్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ముగ్గురు నిందితుల అరెస్టు అవ్వడం... మరోవైపు సుమంత్ కోర్టును ఆశ్రయించడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Former OSD Sumanth, Minister Konda Surekha, Task Force Police, Telangana High Court, CM Revanth reddy, CP Sajjanar

By
en-us Political News

  
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.