కేసీఆర్ వ్యాఖ్యలు ‘బ్రాండ్ తెలంగాణ’కి బ్యాడ్ చేశాయా?

Publish Date:Sep 12, 2014

Advertisement

 

‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’ అనే మాట ఎప్పుడు ఏ మహానుభావుడు చెప్పాడో గానీ, ఆ మహానుభావుడికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ మాట అక్షరాలా సత్యమని చెప్పే సంఘటనలు ఈ ప్రపంచంలో నిరంతరం కనిపిస్తూనే వుంటాయి. ఇప్పుడు తెలుగు ప్రజలకు తాజాగా కనిపిస్తున్న రివర్స్ ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణమైన ఆయన మీద తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన తెలంగాణని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తారని ఆశించారు. అందుకే ఎన్నికలలో ఆయనకి అధికారం ఇచ్చారు. తెలంగాణ ‘బ్రాండ్’ని విశ్వవిఖ్యాతం చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన మాటలు విని మురిసిపోయారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వందరోజులు పూర్తయినా హామీల వర్షం కురిపించడమే తప్ప, ఆవగింజంతయిన అభివృద్ధి జరగకపోయినా కేసీఆర్ మీద ప్రజల నమ్మకం ఎంతమాత్రం సడలలేదు. కానీ పరిపాలన వందరోజులు పూర్తయిన ఉత్సాహంలోనో, తనకు తిరుగేలేదన్న ఆత్మవిశ్వాసంలోనో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు వికటించాయి. ‘బ్రాండ్ తెలంగాణ’ సంగతి అటుంచితే, తెలంగాణ ఇమేజ్‌ని జాతీయ స్థాయిలో దెబ్బతీశాయి.

 

వరంగల్‌లో జరిగిన కాళోజీ శతజయంతి సభలో కేసీఆర్ మీడియా మీద, జర్నలిస్టుల మీద చేసిన వ్యాఖ్యలు ఆ సభలో పాల్గొన్న కొంతమంది అత్యుత్సాహ పరుల చేత చప్పట్లు కొట్టించి వుండొచ్చుగానీ, అవి జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీశాయి. తెలంగాణలో వుండాలంటే మాకు సెల్యూట్ చేయాలి, మెడలు విరిచేస్తాం, పది కిలోమీటర్ల లోతున గొయ్యి తీసి పాతిపెడతాం లాంటి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఒక ముఖ్యమంత్రిని కాకుండా ఒక ఉద్యమకారుడిని చూపించాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లా కాకుండా ఒక ముఠా నాయకుడు మాట్లాడిన మాటల్లా వున్నాయన్న అభిప్రాయాలు జాతీయ స్థాయిలో వ్యక్తమయ్యాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద జాతీయ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అన్ని జాతీయ ఛానళ్ళు కేసీఆర్ వ్యవహారశైలిని, ఆయన మాట్లాడిన మాటల్ని చీల్చి చెండాడేశాయి. టైమ్స్ నౌ ఛానల్లో అర్నబ్ గోస్వామి అయితే కేసీఆర్ వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ జర్నలిస్టుల్ని ఎలా చంపుతారు? ఎలా మెడలు విరుస్తారు? ఎంతమందిని చంపుతారు? కేసీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలి... కేసీఆర్ మీద హత్యాయత్నం కేసులు పెట్టాలి... లేదా ఆయనకు మతిస్థిమితం లేదని ప్రకటించాలి అంటూ రాజ్యాంగంలోని చట్టాలను కూడా ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఛానల్ చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్‌ని అయితే దులిపిపారేశారు. సీమాంధ్రుల మీద నోరు వేసుకుని పడిపోయే వినోద్ కుమార్ కూడా ఆర్నబ్ గోస్వామి ముందు నోరెత్తలేక నీళ్ళు నమిలారు. మిగతా జాతీయ ఛానల్స్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించాయి. ఆయా ఛానళ్ళ చర్చలో పాల్గొన్న కవిత లాంటి టీఆర్ఎస్ నాయకులు బిత్తరపోయేలా స్పందించాయి.

 

కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, వాటికి జాతీయ స్థాయిలో వ్యతిరేకత రావడం, జాతీయ స్థాయి మీడియా కేసీఆర్ని తీవ్రంగా విమర్శించడం.... ఇక్కడితో ఈ ఇష్యూ ముగిసిపోలేదు. మొత్తమ్మీద ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఇమేజ్‌కే డ్యామేజ్ చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ ఇమేజ్ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల కలలను కేసీఆర్ వ్యాఖ్యలు కల్లలు చేసే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇలాంటి వ్యవహారశైలి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పలు ప్రఖ్యాత సంస్థలు పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేవి. ఇప్పుడు రాష్ట్ర విభజన పుణ్యం, టీఆర్ఎస్ నాయకుల తిట్ల పుణ్యమా అని సీమాంధ్ర నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్ వ్యవహారశైలి, మాటలు దేశంలోని ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చే అంశాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఇప్పటికైనా ఈ ముప్పును గ్రహించి కేసీఆర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని లేకపోతే ‘బ్రాండ్ తెలంగాణ’ని మరచిపోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.మన నోటిలో వున్న మాటకి మనం రాజులం.. మన నోరు దాటిన మాటకి మనం బానిసలం. నోరు తెరిస్తే బోలెడన్ని కవితలు, సామెతలు చెప్పే కేసీఆర్ గారికి ఈ సామెత తెలియకుండా వుంటుందా?

By
en-us Political News

  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.