మోడీ డైరెక్షన్ లో గౌతమి కమల్ కు చెక్....

Publish Date:Mar 1, 2018

Advertisement

 

కమల్ హాసన్ ను ఇరుకున పెట్టడానికి మోడీ గౌతమి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతంర తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే అదనుగా బీజేపీ అక్కడ కూడా పాగా వేయాలని పలు ప్రయత్నాలే చేసింది. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. ఇక ఏదో ఒక రకంగా అక్కడ తన బలం పెంచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కమల్ హాసన్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. మొదట్లో బీజేపీకి కాస్త అనుకూలంగా మాట్లాడిన కమల్..ఆతరువాత మాత్రం బీజేపీని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మీద.. మోడీ ప్రభుత్వ తీరు పై ఎన్నో విమర్శలు గుప్పించారు. దీనికి తోడు ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టాడు. అంతేకాదు బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతేనే రజనీతో కలిసి పని చేస్తానని తేల్చిచెప్పాడు కూడా. దీంతో కమల్ తీరుపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఈ సమయంలోనే కమల్‌ను రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు, వ్యక్తిగతంగా కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు చేయడానికి బరిలో దిగినట్టు తెలుస్తోంది. అందుకు గౌతమినీ రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి.

 

కమల్‌ హాసన్‌, గౌతమిలు కొంతకాలం సహజీవనం సాగించిన సంగతి తెల్సిందే కదా. అయితే కొన్ని కారణాల వల్ల ఈమద్యనే వారిద్దరూ విడిపోయారు. దీంతో వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు గౌతమి గత కొంత కాలంగా బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వస్తుంది. ఇక బీజేపీ కూడా గౌతమితో కమల్ ను దెబ్బకొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే.. గౌతమి కూడా మోడీ డైరెక్షన్ తో  కమల్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే... కమల్‌ హాసన్‌ చేసిన పలు చిత్రాలకు తాను కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా మరియు ఇంకా పలు పనులు చేశాను అని, వాటికి సంబంధించిన పారితోషికాలు తనకు ఇవ్వలేదని, కమల్‌ తనకు బాకీ పడ్డాడు అంటూ తాజాగా గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి బీజేపీ ప్లాన్ ను కమల్ ఏ విధంగా తిప్పికొడతారో చూద్దాం..

By
en-us Political News

  
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.