కడప కాంగ్రెస్ లో కలవరం

Publish Date:Mar 21, 2012

Advertisement

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. ఈ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోయే ఉపఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఈ మూడు నియోజకవర్గాల స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా టిక్కెట్ ఆశిస్తున్న అభ్యర్థుల సమాఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇది కూడా ఆ పార్టీకి తలనొప్పిగా మారనుంది. ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తే మరో అభ్యర్థి కినుక వహించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండవచ్చుననే భయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కోడూరు నియోజకవర్గ అభ్యర్థిత్వం ఎమ్మెల్సీ చంగలరాయుడు, ఎంపి సాయిప్రతాప్ లకు ప్రతిష్టగా మారింది. గంటి ప్రసాద్ పేరును ఎంపి సూచిస్తుంటే ఈశ్వరయ్య పేరును ఎమ్మెల్సీ చంగలరాయుడు సూచిస్తున్నారు. కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం ఈశ్వరయ్యకే టిక్కెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఎంపి వైఖరి ఎలా వుంటుందోనన్న ఆందోళన కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి టిక్కెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.

 

 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ దానం నాగుందర్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో  ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయమూంది.  
చారిత్రక  నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు విమానాశ్రయాల ద్వారా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్యాకెట్‌ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.