ఆ ముగ్గురిలో దేశం టిక్కెట్ ఎవరికో?
Publish Date:Mar 21, 2012
Advertisement
చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న ముగ్గురు నాయకులు హైదరాబాద్ స్థాయిలో తీవ్రంగా లాబీలు నిర్వహిస్తున్నారు. టిక్కెట్ ను ఆశిస్తున్న చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ, మాజీ ఎమ్మెల్యే మోహన్ ఇప్పటికే పార్టీ అధినేతను విడివిడిగా కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. నిన్న మొన్నటి వరకు చదలవాడ కృష్ణమూర్తికే టిక్కెట్ దక్కే అవకాశం ఉన్నట్లు స్థానిక తెలుగుదేశం నాయకులు భావించారు. అయితే డి.కె. ఆదికేశవులు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పరోక్షంగా జోక్యం చేసుకోవడంతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ఆయన తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే మోహన్ కు టిక్కెట్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరో ఒకరికి తెలుగుదేశంపార్టీ టిక్కెట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/tirupati-constituency-24-12822.html





