జగన్ పై తిరుగుబాటు మొదలైంది...

Publish Date:Feb 15, 2018

Advertisement

 

ప్రత్యేక హోదా కోసం మేము కూడా పోరడతామని.. ఏప్రిల్ 6 వ తేదీన ఎంపీలందరూ రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. దీనివెనుక జగన్ ప్లాన్ కూడా అందరికీ అర్దమైంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారంట కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం రాజీనామా చేయరంటా. ఈ మాట చెప్పింది ఎవరో కాదు స్వయంగా జగనే.

 

దీంతో మిగిలిన ఎంపీలు జగన్ పై తిరుగుబాటు చేశారు. ఎంపీలు రాజీనామా అంటే విజయసాయిరెడ్డి కూడా చేయాల్సిందే అని ఎంపీలు ఎస్పీ సుబ్బారెడ్డితో సహా అందరూ పట్టుబట్టారట. అయితే దీనికి జగన్.. ఢిల్లీలో మన తరపున లాబీయింగ్ కి సాయన్న అవసరం ఉందని అన్నారట. ఆ విషయం మనకు తెలుసు కానీ..ప్రజలకు చెప్పలేం కదా... ఎంపీలందరూ రాజీనామా చేసి విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే ఏం చెబుతాం అని జగన్ కు గట్టిగానే సమాధానం చెప్పారంట. అంతేకాదు.. ఇప్పటికే విజయసాయిరెడ్డి బీజేపీ నేతలతో కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు.. దాంతో అందరూ మనం బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నామనే అంటున్నారు.. ఇప్పుడు ఆయన రాజీనామా చేయకపోతే మనంతట మనమే అది నిజం చెప్పినట్టు అవుతుంది.. అని అన్నారట. మరి ఇప్పటికే జగన్ తన మోనార్క్ తెలివితేటలు చూపించి... చాలా మంది నేతలను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఈ కొంతమందిని కూడా దూరం చేసుకుంటే... పార్టీ చేతులెత్తేసినట్టే. మరి అందరికీ ఒక న్యాయం.. ఇంటి వాళ్లకు ఒక న్యాయం అంటే రాజకీయాల్లో కుదరదు కదా మరి..

By
en-us Political News

  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.