అనంతపురం జిల్లాలో యథేచ్చగా ఐరన్ ఓర్ అక్రమ తవ్వకాలు?
Publish Date:Apr 17, 2012
Advertisement
కర్ణాటక-అనంతపురం సరిహద్దుల్లోని ఐరన్ ఓర్ మైనస్ లో తవ్వకాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయినా అక్కడ యథేచ్చగా మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. జిల్లాకు చెందిన ఒక మంత్రి, కొందరు ప్రతిపక్ష నాయకులు, ఇద్దరు అధికారులు ఒక ముఠాగా ఏర్పడి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తవ్వించి క్రషర్ల యజమానులకు అమ్ముతున్నారు. ఈ ముఠా రోజుకు ఐదువేల టన్నుల ఇనుప ఖనిజాన్ని దోచేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ లో ముడిఖనిజం ధర టన్నుకు సుమారు నాలుగు వేల రూపాయల వరకూ ఉంది. ఇటీవల విజిలెన్స్ అధికారులు కొన్ని క్రషర్లపై దాడిచేసి పెద్దేత్తున ఇనుప ఖనిజం నిల్వలను గుర్తించారు. క్రషర్ల యజమానులకు 4.5 టన్నుల కోట్ల రూపాయల జరిమానా కూడా విధించారు. అయితే క్రషర్ల యజమానులు జిల్లాకు చెందిన ఒక మంత్రి సాయంతో ఈ జరిమానాను కట్టకుండా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని క్రషర్ల యజమానులు మంత్రికి వాగ్థానం చేసినట్లు తెలిసింది. అయితే, అభార్తి ఖర్చుల విషయం సరే! తన సంగతేంటని ఆ మత్రిగారు క్రషర్ల యజమానులను అడిగినట్లు తెలుస్తోంది. మంత్రిగారిని సంతృప్తి పరచటం తమకు పెద్దపనేమీ కాదనీ, తమ కార్యకలాపాలు నిరాటంకంగా సాగేందుకు సహకరించాలని వారు కోరటం అందుకు మంత్రిగారు సరేనని భరోసా ఇవ్వటం జరిగినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/iron-ores-of-karnatakaanantapur-border-24-13410.html





